Realme GT Neo 3T: భారత మార్కెట్లోకి వచ్చేసిన రియల్‌మీ కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. రూ. 7 వేలు డిస్కౌంట్ పొందే అవకాశం..

|

Sep 16, 2022 | 8:43 PM

Realme GT Neo 3T: రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేసింది. రియల్‌మీ జీటీ నియో 3టీ పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ సేల్‌ సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. ఫోన్‌ ఫీచర్లు మీకోసం...

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ జీటీ నియో 3టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ఇప్పటికే గ్లోబల్‌ మార్కెట్లో విడుదల కాగా సెప్టెంబర్‌ 23 నుంచి భారత్‌లో అందుబాటులోకి రానుంది.

2 / 5
మూడు వేరియంట్లలో రానున్న ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే.. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ.29,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.31,999. 8జీబీ ర్యామ్ + 256జీబీ ధర రూ.33,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా రూ. 7 వేలు డిస్కౌంట్‌ లభించనుంది.

3 / 5
 ఇక ఈ ఫోన్‌ పీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 120hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.62 అంగుళాల ఈ4 అమొలెడ్ డిస్‌ప్లేను అందించారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

4 / 5
ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 80 వాట్‌ సూపర్ డార్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. 12 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ కావడం ఈ ఫోన్‌ ప్రత్యేకత.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.