- Telugu News Photo Gallery Technology photos Oppo launching new smartphone Oppo F21 pro 5G Features and price details
Oppo F21 pro 5G: ఒప్పో నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Oppo F21 pro 5G: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మార్కెట్లో రోజుకో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ సందడి చేస్తున్న తరుణంలో ఒప్పో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Apr 14, 2022 | 3:57 PM

వచ్చే ఆగస్టు నాటికి దేశంలో 5జీ ఆధారితి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్లనీ ఇప్పటికే 5జీ ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఒప్పో ఇప్పటికే పలు ఫోన్లను విడుదల చేయగా తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.

ఒప్పో ఎఫ్ 21ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ స్మార్ట ఫోన్ ధర విషయానికొస్తే రూ. 26,999గా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ 60 హెచ్‌జెడ్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఈ 5జీ ఆధారిత స్మార్ట్ ఫోన్‌లో మూడు కెమెరాల సెటప్‌తో రెయిర్ కెమెరాను అందించారు. వీటిలో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. వీటితో పాటు వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ మరో ప్రత్యేకత.




