- Telugu News Photo Gallery Technology photos Oppo launches new smart phone in india Oppo a59 5g price and features
Oppo A59 5G: భారత మార్కెట్లోకి ఒప్పో కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలో సూపర్ ఫీచర్స్..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఏ59 5జీ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ గతంలోనే చైనాలో లాంచ్‌కాగా తాజాగా ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఒప్పో ఏ59 పేరుతో ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Dec 23, 2023 | 8:31 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో ఏ59 పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను శుక్రవారం లాంచ్ కాగా డిసెంబర్ 25 వ తేదీని అందుబాటులోకి రానుంది. ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి.

ఈ ఫోన్ ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా నిర్ణయించారు. ఇక కొనుగోలు సమయంలో ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు.

ఇక ఒప్పో ఏ59 5జీ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 13.1పై పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

బ్యాటరీ విషయానికొస్తే ఒప్పో ఏ59 5జీ ఫోన్‌లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. కేవలం 30 నిమిషాల్లో 52 శాతం ఛార్జింగ్ కావడం ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.




