Whatsapp Instagram: అదిరిపోయే ఫీచర్‌.. వాట్సాప్‌ స్టేటస్‌, ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీగా..

|

Dec 06, 2023 | 12:37 PM

ప్రముఖ సోషల్‌ మీడియా సైట్స్‌ అయిన వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు యూత్‌లో ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెటా యాజమాన్యానికి చెందిన ఈ రెండు సోషల్‌ మీడియా సైట్స్‌ నిత్యం ఏదో ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొస్తూ యూత్‌ను అట్రాక్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ను అనుసంధానిస్తూ ఈ ఫీచర్‌ను తెచ్చారు..

1 / 5
వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా యాప్స్ తమ యూజర్లను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా  ఈరెండు యాప్స్‌ను ఇంటర్‌ లింక్‌ చేస్తూ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు.

2 / 5
వాట్సాప్‌ స్టేటస్‌లో పోస్ట్ చేసే ఫొటోను అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలోనూ పోస్ట్ చేసే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ! అచ్చంగా ఇలాంటి ఐడియాతోనే ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నారు.

3 / 5
డబ్ల్యూఏబెటాఇన్ఫో నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉంది. టెస్టింగ్ పూర్తయిన వెంటనే ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

4 / 5
ఆండ్రాయ్‌ 2.23.25.20 అప్‌డేట్ వాట్సాప్‌ బీటాలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. అప్‌డేట్ స్టేటస్-షేరింగ్ ఫీచర్‌ని మరింత మెరుగుపరచడానికి కంపెనీ ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది.

5 / 5
ఇదిలా ఉంటే వాట్సాప్‌ స్టేటస్‌లను నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసే సమయంలో ఎడిటింట్‌ ఫీచర్స్‌తో మరిన్ని మార్పులు చేసుకోవచ్చు. ఇలా రెండు యాప్స్‌ను అనుసంధానం చేయడం ద్వారా యూజర్లకు మరింత బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వొచ్చని మెటా భావిస్తోంది.