
భారత్‌కు చెందిన ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్థ నాయిస్ మార్కెట్లోకి కొత్త వైర్‌లెస్ ఈయర్‌బడ్స్‌ని లాంచ్ చేసింది. నాయిస్ బడ్స్ వీఎస్204 పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయర్ బడ్స్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించింది.

13mm సౌండ్ డ్రైవర్స్‌తో కూడిన ఈ ఇయర్ బడ్స్ చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 50 గంటల ప్లేబ్యాక్‌టైమ్ ఇస్తాయి. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు.

వాటర్ రెసిస్టెంట్ కోసం ఇందులో IPX4 రేటింగ్‌ను ఇచ్చారు. ఇక క్లారిటీతో కూడిన కాల్స్ కోసం ఇందులో ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ (ENC) టెక్నాలజీని అందించారు. దీంతో పరిసరాల్లో శబ్దాలు ఉన్నా కాల్స్‌కి ఆటంకం లేకుండా మాట్లాడొచ్చు.

కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3 వెర్షన్ అందించారు. దీంతో 10 మీటర్ల రేంజ్‌లో కనెక్ట్ అవుతాయి. అంతేకాకుండా చార్జింగ్ కేస్ మూత తెరవగానే ఆటోమేటిక్‌గా డివైజ్‌కు కనెక్ట్ అవుతుంది.

ధర విషయానికొస్తే ఈ ఇయర్ బడ్స్ రూ. 1599కి అందుబాటులో ఉండనున్నాయి. త్వరలోనే ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభంకానున్న ఈ ఇయర్‌బడ్స్.. జెట్ బ్లాక్, మింట్ గ్రీన్, స్లో వైట్, స్పేస్ బ్లూ కలర్స్‌లో లభిస్తాయి.