Motorola: మార్కెట్లోకి మోటోరోలా కొత్త ఫోన్‌.. అండర్‌ వాటర్‌ ప్రొటెక్షన్‌ వంటి అడ్వాన్స్‌ ఫీచర్‌..

|

Sep 23, 2023 | 9:21 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ మోటోరోలా ఇటీవల బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ కొత్త ఫోన్‌లన లాంచ్‌ చేస్తోంది. ముఖ్యంగా రూ. 25వేల లోపు బడ్జెట్‌ ఫోన్స్‌ మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటోరోలా ఎడ్జ్‌ 40 నియో పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం...

1 / 5
ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం మోటోరోలా భారత మార్కెట్లోకి మోటోరోలో ఎడ్జ్‌ నియో 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 5జీ నెట్‌వర్క్‌కి ఈ ఫోన్‌ సపోర్ట్ చేస్తుంది.

2 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ను అండర్‌ వాటర్‌ ప్రొటెక్షన్‌ టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 30 నిమిషాల పాటు 1.5 మీటర్ల లోతులో నీటిని ముంచేసినా మొబైల్ పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందుకోసం ఐపీ68 సర్టిఫికేషన్‌ అందించారు.

3 / 5
ఇక మోటోరోలా ఎడ్జ్‌ 40 నియో స్మార్ట్‌ ఫోన్‌లో 6.55 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ కర్వ్‌ర్డ్‌ డిస్‌ప్లేను అందించారు. 144 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌రేట్ ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌ను ఇచ్చారు.

4 / 5
ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

5 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 68 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో విడుదల చేశారు. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 23,999కాగా, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 25,999గా ఉంది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానుంది.