- Telugu News Photo Gallery Technology photos Low budget projector Portable Mini Projector Color LED LCD Video Multimedia Home Theater HDMI Projector in amazon, Check here for full details
Mini Projector: రూ. 3వేలతో ఇంటిని థియేటర్‌గా మార్చేయండి.. అదిరిపోయే ప్రొజెక్టర్
ప్రస్తుతం ఇంట్లోనే థియేటర్ సెటప్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది. ఇంట్లోనే బిగ్ స్క్రీన్‌లపై సినిమాలు చూస్తున్నారు. ఇక మరికొందరు ప్రొజెక్టర్ల సహాయంతో సినిమాలను వీక్షిస్తున్నారు. అయితే ప్రొజెక్టర్లు అనగానే ఎక్కువ ధర ఉంటాయని భావిస్తారు. కానీ తక్కువ బడ్జెట్‌లో కూడా ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి..
Updated on: Jun 13, 2024 | 7:59 AM

ప్రస్తుతం తక్కువ ధరకే ప్రొజెక్టర్లు లభిస్తున్నాయి. ఒకప్పుడు ప్రొజెక్టర్లు అంటే ఎక్కువ ధర ఉండేవి. కానీ ప్రస్తుతం భారీగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో ఓ ప్రొజెక్టర్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

Portable Mini Projector Color LED LCD Video Multimedia Home Theater పేరుతో ఈ మినీ ప్రొజెక్టర్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. తక్కువ పరిమాణం, లైట్ వెయిట్‌తో ఉన్న ఈ ప్రొజెక్టర్‌ను ఎక్కడికైనా సింపుల్‌గా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే దీని ఇన్‌స్టాలేషన్ కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు.

ఈ ప్రొజెక్టర్ గరిష్టంగా 170 ఇంచెస్ స్క్రీన్‌ను ప్రొజెక్ట్ చేయగలదు. అయితే 50 నుంచి 100 ఇంచెస్ స్క్రీన్ మంచి క్వాలిటీ వీడియో ప్రొజెక్ట్ అవుతుంది. గేమ్స్ ఆడుకునే వారికి సినిమాలు వీక్షించేవారికి ఈ ప్రొజెక్టర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇక ఈ మినీ ప్రొజెక్టర్‌ను హెచ్‌డీఎమ్‌ఐ, యూఎస్‌బీకి సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రొజెక్టర్‌ను టీవీలు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, డిజిటల్ కెమెరాలకు సులభంగా కనెక్ట్ చేయొచ్చు. 400 ల్యూమన్స్ బ్రైట్‌నెస్, 1080పీ రిజల్యూషన్ స్క్రీన్‌ను అందిస్తుంది.

ఈ ప్రొజెక్టర్‌ను వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు. 1920 x 1080 డిస్‌ప్లే రిజల్యూషన్ ఈ ప్రొజెక్టర్ సొంతం. ఇందులో ఎల్‌సీడీ డిస్‌ప్లే టెక్నాలజీని అందించారు. ధర విషయానికొస్తే ఈ మిని ప్రొజెక్టర్ అసలు ధర రూ. 5,999కాగా అమెజాన్‌లో 50 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 2999కే లభిస్తోంది.





























