Vivo Y58 5G: వివో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయంటే

ప్రస్తుతం మార్కెట్లో కొంగొత్త ఫోన్స్‌ హంగామా చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొత్త ఫోన్స్‌ను తీసుకొస్తున్నాయి. కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. వివో వై58 పేరుతో 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో వస్తున్న ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Jun 13, 2024 | 7:52 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. వివో వై58 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను.. వచ్చే నెలలో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు.

2 / 5
ఇక ఈ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ 1024 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను అందిస్తున్నారు. 8 జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. కర్వ్డ్‌ ఎడ్జెస్‌తో కూడిన సర్క్యులర్‌ రెయిర్ కెమెరా మాడ్యూల్‌ను అందించారు.

3 / 5
ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ సెన్సర్‌ కెమెరా, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన షూటర్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

4 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 44 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందిస్తున్నారు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఇంటర్నల్ మెమోరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. ర్యామ్‌ను వర్చువల్‌గా 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ స్పీకర్స్, అథంటికేషన్ అండ్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇచ్చారు.

5 / 5
Follow us