Jio Plans: ఓటీటీ యూజర్లకు జియో స్పెషల్‌ ప్లాన్స్‌.. మూడు నెలల హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు..

|

Jun 04, 2022 | 3:36 PM

Jio Plans: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోన్న వేళ టెలికాం కంపెనీలు సైతం, ఓటీటీల కోసమే ప్రత్యేకంగా ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. తాజాగా రిలయన్స్‌ జియో నాలుగు ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్‌తో కలిగే ప్రయోజనాలు మీకోసం..

1 / 5
 ఓటీటీ యూజర్లను ఆకట్టుకునే క్రమంలో రిలయన్స్‌ జియో కొత్తగా నాలుగు రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్‌తో మూడు నెలల డిస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర బెనిఫిట్స్‌ పొందొచ్చు.

2 / 5
రూ. 151 ప్లాన్‌: ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 8 జీబీ డేటా లభిస్తుంది. అలాగే 90 రోజుల వ్యాలిడిటీతో కూడిన డిస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. 8 జీబీ డేటా ముగిసన తర్వాత ఇంటర్‌నెట్‌ స్పీడ్‌ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.

3 / 5
రూ. 333 ప్లాన్‌: ఈ ప్లాన్‌తో ప్రతి రోజూ 1.5 జీబీ డేటా పొందొచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే మూడు నెలల డిస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. అంతేకాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌ వంటి ప్రయోజనాలు అదనం.

4 / 5
రూ. 583 ప్లాన్‌: ఈ ప్లాన్‌ రీఛార్జ్‌ ద్వారా 56 రోజుల వ్యాలిడిటీ రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు మూడు నెలల వ్యాలిడిటీతో కూడిన డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

5 / 5
రూ.783 ప్లాన్‌: జియో అందిస్తోన్న ఈ చివరి ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకి 1.5 జీబీ డేటా పొందొచ్చు. వీటితో పాటు మూడు నెలల వ్యాలిడిటీతో డిస్నీ+హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు.