- Telugu News Photo Gallery Technology photos HP Launches new gaming laptop HP OMEN 16 features and price details
HP OMEN 16: సరికొత్త గేమింగ్ ఎక్స్‌పీరియన్స్.. హెచ్‌పీ నుంచి కొత్త ల్యాప్‌టాప్
ప్రస్తుతం మార్కెట్లో గేమింగ్ ల్యాప్‌టాప్‌లకు ఆదరణ పెరుగుతోంది. అధునాతన గేమ్స్‌కు సపోర్ట్ చేసే విధంగా హై ఎండ్ ఫీచర్స్‌తో ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం హెచ్‌పీ మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. హెచ్‌పీ ఓమెన్ 16 పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jan 13, 2024 | 5:07 PM

కంప్యూటర్స్, ప్రింటర్స్‌కు పెట్టింది పేరైన హెచ్‌పీ కంపెనీ మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఓమెన్ 16పేరుతో గురువారం ఈ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ప్రొఫెషనల్ గేమర్‌లకు ఉపయోగపడేలా అధునాతన ఫీచర్లతో ఈ ల్యాప్‌ను డిజైన్ చేశారు. అదిరిపోయే గ్రాఫిక్స్‌తో పాటు ఎంతసేపు వాడినా వేడేక్కకుండా ఉండేలా ఇందులో లేటెస్ట్ కూలింగ్ టెక్నాలజీని అందించారు.

ఈ ల్యాప్‌టాప్ ధర విషయానికొస్తే రూ. 1,60,999గా నిర్ణయించారు. ఓమెన్ 16 ల్యాప్‌టాప్ గేమర్స్‌కు సరికొత్త అనుభూతిని అందిస్తుందని వారికి అన్ని విధాలా సరిపోయేలా దీనిని రూపొందించినట్లు హెచ్‌పీ చెబుతోంది.

ఇక హెచ్‌పీ ఓమెన్ 16 ల్యాప్‌టాప్‌లో 15 జెన్ ఇంటెల్ ఐ7 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో NVIDIA GeForce RTX గ్రాఫిక్స్‌ను ఇచ్చారు. హీట్‌ను కంట్రోల్ చేసేందుకు ఎయిర్ ఫ్లో సిస్టమ్‌ను ఇచ్చారు.

అలాగే ఈ ల్యాప్‌టాప్‌లో 32 జీబీ వరకు ర్యామ్‌ను అందించారు. ఈ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే సమయంలో హైపర్‌ఎక్స్ పల్స్‌ఫైర్ హేస్ట్2 వైర్‌లెస్ గేమింగ్ మౌజ్‌తో పాటు గేమింగ్ మౌస్ ప్యాడ్‌ను ఉచితంగా పొందొచ్చు.




