ఎలాన్ మస్క్ నేతృత్వంలో పనిచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ఎక్స్‌ఏఐ తమ చాట్‌బాట్‌ను లాంచ్ చేసింది. గ్రోక్ పేరుతో ఈ ఏఐ టూల్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పోటీనిచ్చేందుకు ఈ కొత్త టూల్‌ను తీసుకొచ్చారు.
చాట్ జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్‌ల కంటే మెరుగ్గా గ్రోక్ పనితీరు ఉంటుందని ఎక్స్‌ఏఐ సంస్థ తెలిపింది. గతేడాది ఓపెన్ ఏఐ సంస్థ విడుదల చేసిన చాట్ జీపీటీ ప్రపంచం దృష్టిని ఆకర్‌సించిన నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడంవైపు దృష్టిసారిస్తున్నాయి.
ఎక్స్‌ఏఐ సంస్థ ప్రారంభమైన కేవలం 8 నెలల్లోనే చాట్‌బాట్‌ను తీసుకురావడం గమనార్హం. ఇతర ఏఐ వ్యవస్థలు అందించని ఎన్నో సమస్యలకు గ్రోక్ చాట్‌బాట్ సమధానం ఇస్తుందని ఎలాన్ మస్క్ చెబుతున్నాఉ. మ్యాథ్స్, కోడింగ్ వంటి అకాడమిక్ పరీక్షల్లో చాట్ జీపీటీ 3.5 కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
ప్రస్తుతం గ్రోక్ ఏఐ టూల్‌ను ఎక్స్ ప్రీమియం ప్లస్ యూజర్లు యాక్సెస్ చేసుకోవచ్చని ఎలాన్ మస్క్ తెలిపారు. మొదట్లో గ్రోక్ ఏఐ టూల్‌ను అమెరికాలో తీసుకొచ్చారు. అయితే తాజాగా ఇండియాలోనూ ఈ సేవలను ప్రారంభించారు.
ప్రస్తుతం ప్రాథమిక దశలో సేవలు అందిస్తున్న గ్రోక్ టూల్ రానున్న రోజుల్లో మరింత మెరుగు పరిచి విస్తృత స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇదిలా ఉంటే ఎక్స్ ప్రీమియం ప్లస్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రస్తుతం 16 డాలర్లుగా ఉన్న విషయం తెలిసిందే.