smartphones: కొత్తేడాది కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? మార్కెట్లోకి వస్తున్న లేటెస్ట్‌ ఫోన్స్‌ ఇవే..

|

Dec 24, 2023 | 10:45 AM

కోటి ఆశలతో కొత్తేడాది పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇక న్యూ ఇయర్‌లో ఏదైన కొత్త వస్తువు కొనుగోలు చేయాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు. మీరు కూడా ఈ కొత్తేడాదిలో స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? మీ కోసమే స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు ఈ ఏడాది కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న కొన్ని బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
అసూస్ రాగ్‌ ఫోన్‌ 8: అసూస్‌ రాగ్‌ ఫోన్‌ 8ని జవనరిలో లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్‌ను 512 జీబీ/1టీబీ వేరియంట్‌లో లాంచ్‌ చేయనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు.

2 / 5
వన్‌ప్లస్‌ 12 సిరీస్‌: 2024 ఏడాదిలో మార్కెట్లోకి రానున్న స్మార్ట్‌ ఫోన్స్‌లో వన్‌ప్లస్‌ 12 సిరీస్‌ ఒకటి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను జనవరి 23వ తేదీన లాంచ్‌ చేయనున్నారు. ఇందులో 6.82 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌టీపీఈఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 64 ఎంపీ రెయిర్‌ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు.

3 / 5
రెడ్‌మీనోట్‌ 13 సిరీస్‌: చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ వచ్చే ఏడాది నోట్‌ 13 సిరీస్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇందులో భాగంగా నోట్‌ 13, నోట్‌ 13 ప్రో, నోట్‌ 13 ప్రో ప్లస్‌ మోడల్స్‌ను తీసుకురానుంది. ఈ ఫోన్స్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. నోట్‌ 13లో 100 ఎంపీ కెమెరా, నోట్‌ 13 ప్రో మోడల్స్‌లో 200 ఎంపీ కెమెరాను అందించనున్నారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

4 / 5
 వివో ఎక్స్‌ 100 సిరీస్‌: వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న స్మార్ట్‌ ఫోన్స్‌లో వివో ఎక్స్‌ 100 సిరీస్‌ ఒకటి. ఈ సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్‌100, వివో ఎక్స్‌ 100 ప్రో పేర్లతో రెండు ఫోన్‌లను లాంచ్‌ చేయనున్నారు ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన 8 ఎల్‌టీపీఓ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారు.

5 / 5
సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌24: ఇక మార్కెట్లోకి రానున్న మరో కొత్త ఫోన్‌ సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌ 24 సిరీస్‌. ఈ సిరీస్‌లో భాగంగా గ్యాలక్సీ ఎస్‌24, గ్యాలక్సీ ఎస్‌ 24+, గ్యాలక్సీ ఎస్‌24 అల్ట్రా మోడల్స్‌ను లాంచ్‌ చేయనుంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఐపీ68 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌ను అందించారు. 8కే క్వాలిటీతో కూడిన వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.