- Telugu News Photo Gallery Technology photos Best foldable phones in market now, Check here for full details
Foldable Phones: ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్ ఫోల్డబుల్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
స్మార్ట్‌ఫోన్ తయారీలో అనూహ్య మార్పులు వచ్చాయి. మారుతోన్న కాలంతోపాటు ఫోన్‌ల తయారీలో కూడా మార్పులు వచ్చాయి. ఇలా అందుబాటులోకి వచ్చినవి ఫోల్డబుల్ ఫోన్స్. మార్కెట్లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. మరి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ ఏంటి.? వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 19, 2024 | 8:03 AM

Google Pixel Fold: బెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్‌లో గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. లక్షన్నర వరకు ఉంది. ఈ ఫోన్‌లో 7.6 ఇంచెస్‌తో కూడిన ప్రైమరీ స్క్రీన్‌ను అందించారు. 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు.

Motorola Razr 40 Ultra: 2023లో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. రేజర్ 40 అల్ట్రా ధర రూ. 80 వేల వరకు ఉంది. ఇందులో 6.9 ఇంచెస్‌తో కూడిన మమెయిన్ స్క్రీన్‌ను అందించారు. ఇక సెకండ్ స్క్రీన్‌ను 3.6 ఇంచెస్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 14 వరకు ఈ ఫోన్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. 30 వాట్స్ వైర్డ్, 5 వాట్స్ వైర్‌లెస్ ఛార్జర్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 3800 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

Oneplus Open: వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ. 1,39,999గా ఉంది.ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.31 ఇంచెస్‌తో కూడిన కవర్ డిస్‌ప్లేను అందించారు. ఇక ఇందులో సెకండరీ స్క్రీన్‌ను సైడ్‌కు అందించారు. అల్ట్రా తిన్ గ్లాస్‌ను ఇచ్చారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ చేశారు.

Samsung Galaxy Z Flip5: మార్కెట్లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్‌లో ఇదీ ఒకటి. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 91,499గా నిర్ణయించారు. ఇందులో సెకండరీ స్క్రీన్‌ను ఫ్లిప్ మోడల్‌లో అందించారు. ఈ ఫోన్‌ను కూడా వాటర్ రెస్టింట్‌గా లాంచ్ చేశారు.ఇందులో 3700 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన బ్యాటరీని అందించారు.

Samsung Galaxy Z Fold5: సామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఈ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ. 1,49,999గా ఉంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్‌లో కవర్ స్క్రీన్‌ను 6.2 ఇంచెస్‌తో అందించారు. ఇందులో కూడా సెకండ్ స్క్రీన్‌ను సైడ్‌కు ఇచ్చారు. వాటర్ రెస్టింట్‌తో కూడిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది.




