
మెరుగైన పనితీరు కలిగిన ఉత్తమ ల్యాప్ టాప్ లలో ఏసర్ క్రోమ్ బుక్ ఒకటి. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతుంది. దీనిలోని సెరెలాన్ ఎన్4500 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తో మీ రోజు వారీ పనులను సమర్థంగా చేసుకోవచ్చు. 15.6 అంగుళాల డిస్ ప్లే, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. యూఎస్ బీ పోర్టులు, హెడ్ ఫోన్లు, స్పీకర్ల కోసం 3.5 ఎంఎం కాంబో జాక్ కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. అమెజాన్ లో రూ.20,990కు ఈ ల్యాప్ టాప్ అందుబాటులో ఉంది.

రోజువారీ పనుల కోసం లెనోవా ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్ టాప్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలోని 14 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే తో విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీడియా టెక్ కంపానియో 520 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ దీని ప్రత్యేకతలు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అన్ని రకాల యాప్ లకు యాక్సెస్ లభిస్తుంది. వీడియో కాల్స్ తో పాటు ఆన్ లైన్ మీటింగ్ లకు చాలా ఉపయోగంగా ఉంటుంది.

అత్యుత్తమ రేటింగ్ కలిగిన క్రోమ్ బుక్ కోసం చూసేవారికి హెచ్ పీ మంచి ఎంపిక. దీనిలోని 4 కోర్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ తో పనితీరు చాలా వేగంగా ఉంటుంది. 14 అంగుళాల మైక్రో ఎడ్జ్ డిస్ ప్లే, ఏమూల నుంచైనా ల్యాప్ టాప్ ను వీక్షించే వీలు, వైఫై 5, బ్లూటూత్ 5.0 తో అంతరాయం లేని కనెక్టివిటీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. చాలా తేలికగా ఉండడంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. సుమారు 7 నుంచి 8 గంటల సామర్థ్యం కలిగిన బ్యాటరీ అదనపు ప్రత్యేకత. ఈ ల్యాప్ టాప్ అమెజాన్ లో రూ.24,768కు అందుబాటులో ఉంది.

మంచి పనితీరు కలిగిన బ్రాండెండ్ ల్యాప్ టాప్ ను తక్కువ ధరకే పొందాలనుకునేవారికి సామ్సంగ్ క్రోమ్ బుక్ ఉత్తమ ఎంపిక. దీనిలోని 11.6 అంగుళాల డిస్ ప్లే తో చిత్రాలను స్పష్టంగా చూడవచ్చు. ప్రయాణంలో కూడా చక్కని క్లారిటీ తో వినియోగించుకోవచ్చు. ఇంటెల్ ఆటమ్ ఎక్స్ 5 ప్రాసెసర్ తో పనితీరు చాలా బాగుంటుంది. వెబ్ బ్రౌజింగ్ తో పాటు రోజువారీ పనులకు చాలా అనువైనది. 2 జీబీ మెమరీతో ప్రాథమిక మల్టీ టాస్కింగ్, క్రోమ్ ఓఎస్ యాప్ లను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. అమెజాన్ లో రూ.33,719కి ఈ ల్యాప్ టాప్ ను కొనుగోలు చేయవచ్చు.

ప్రముఖ బ్రాండ్ హెచ్ పీ నుంచి విడుదలైన మరో బెస్ట్ మోడల్ ల్యాప్ టాప్ ఇది. అనేక రకాల పనుల కోసం చక్కగా ఉపయోగపడుతుంది. దీనిలోని 4 కోర్ ఇంటెల్ ప్రాసెసర్ తో పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది. వేగవంతమైన బూట్ సమయం, ఆటోమేటిక్ అప్ డేట్ లు, క్రిస్టల్ క్లియర్ ఇమేజ్ అందించే ఇంటెల్ యూహెచ్ డీ గ్రాఫిక్స్, 65 జీబీ స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్సులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. డ్యూయల్ ఆర్రే మైక్రోఫోన్లతో పాటు 720పీ హెచ్ డీ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్ టాప్ రూ.29,990కు అమెజాన్ లో అందుబాటులో ఉంది.