
బోట్ వేవ్ లైట్ స్మార్ట్ వాచ్ 1.69 అంగుళాల హెచ్‌డీ డిస్ ప్లేతో వస్తుంది. ముఖ్యంగా ఈ వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ వాచ్ 10+ స్పోర్ట్స్ మోడ్లు, హృదయ స్పందన రేటు, ఎస్‌పీఓ2 పర్యవేక్షణ వంటి లక్షణాలతో ఆకట్టుకుంటుంది. ఇది ఫిట్ నెస్ ఔత్సాహికులకు సరైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వాచ్‌ను కేవలం రూ.749కు సొంతం చేసుకోవచ్చు.

ఫాస్ట్రాక్ లిమిట్ లెస్ ఎక్స్2 స్మార్ట్ వాచ్ అమెజాన్‌లో రూ.1599కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ 1.91 అంగుళాల అల్ట్రావియూ డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్, 100 ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌లు, ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ ప్రీమియం డిజైన్, బలమైన నిర్మాణ నాణ్యత దీనిని స్టైల్, పెర్ఫార్మెన్స్ రెండింటిలోనూ గొప్పగా చేస్తాయి.

ఫైర్-బోల్ట్ నింజా 2 మ్యాక్స్ స్మార్ట్ వాచ్ రూ.1620 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ 1.5 అంగుళాల ఫుల్ టచ్ డిస్ ప్లే, 20 స్పోర్ట్స్ మోడ్లు, హార్ట్ రేట్, ఎస్‌పీఓ2 మానిటరింగ్, ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. అలాగే ఫిట్ నెస్ ట్రాకింగ్ కోసం ఈ వాచ్ అద్భుతమైన ఎంపిక.

నాయిస్ కలర్ ఫిట్ పల్స్ 2 మ్యాక్స్ స్మార్ట్ వాచ్ రూ. 1199 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ 1.85 అంగుళాల అతి పెద్ద డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, 100 ప్లస్ స్పోర్ట్స్ మోడ్లు, హెల్త్ మానిటరింగ్ ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ వాచ్ స్టైలిష్ డిజైన్ వల్ల ఉపయోగించడానికి సులభమైన ఇంటర్ ఫేస్‌తో ఆకర్షణీయంగా మారుస్తుంది.

నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గో బజ్ స్మార్ట్ వాచ్ 1.69 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‌పీఓ2 ట్రాకింగ్, 100 ప్లస్ వాచ్ ఫేస్లు వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది ఈ వాచ్ ధర కేవలం రూ. 1099గా ఉంది.