OnePlus Nord CE 3 Lite 5G: అమెజాన్‌లో వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ (8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్)ధర రూ. 19,999. ఒకవేళ వినియోగదారులు తమ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేసినట్లయితే, అదనంగా రూ. 18,750 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా కోటక్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా చేసే లావాదేవీపై 10 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంది
Samsung Galaxy S20 FE 5G: శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ(8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) ధర అమెజాన్‌లో రూ. 26,990 లుగా ఉంది. అయితే రూ. 25,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా మీరు రూ.10 వేల కంటే తక్కువ ధరకే ఈ ఫోన్‌ని పొందవచ్చు. ఇవే కాక ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా కోటక్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా చేసే లావాదేవీపై 10 శాతం అనగా గరిష్టంగా రూ. 1000 వరకు డిస్కౌంట్ కూడా ఉంది.
Oneplus 11 5G: అమెజాన్ లో వన్ ప్లస్ 11 5జీ(8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) ధర రూ. 56,999. అయితే మీరు దీన్ని 30,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్‌పై రూ. 25,000 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అమలులో ఉంది. ఇదే కాక ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా కోటక్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా చేసే లావాదేవీపై 10 శాతం అంటే గరిష్టంగా రూ. 1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
Samsung Galaxy M14: శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ 6జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.14,990. కానీ కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేసినట్లయితే, అదనంగా రూ. 14,200 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. అలాగే క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్‌పై అదనంగా రూ. 1500 డిస్కౌంట్ పొందవచ్చు.