హెచ్పీ 15ఎస్: లాప్‌టాప్‌లకు పెట్టింది పేరైన హెచ్‌పీకి చెందిన ఈ లాప్‌టాప్‌ను అమెజాన్ సేల్‌లో భాగంగా రూ.37,990లకే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.47,142గా ఉంది. ఇక ఎక్చ్చేంజ్ ఆఫర్ కింద రూ.12,850 డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే.. 15.6-అంగుళాల ఫుల్ హెచ్ డీ యాంటీ గ్లేర్ డిస్ ప్లే, ఏఎండీ రేజెన్3 5300యూ ప్రాసెసర్, 8జీబీ ఆఫ్ డీడీఆర్4 రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లను ఇచ్చారు.