Alexa: కొత్త రూపు సంతరించుకోనున్న అలెక్సా.. అయితే ఓ కండిషన్‌

|

Jun 23, 2024 | 10:57 AM

ప్రస్తుతం మార్కెట్లో వాయిస్‌ అసిస్టెంట్‌ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. యాపిల్ మొదలు, గూగుల్, అమెజాన్‌ వరకు వాయిస్‌ అసిస్టెంట్ సేవలను అందిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అందిస్తున్న అలెక్సా సేవల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అయితే తాజాగా అలెక్సాలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు..

1 / 5
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. వాయిస్‌ అసిస్టెంట్ సేవలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్‌ సైతం అలెక్సా ఏఐని ఉపయోగించనున్నారు.

2 / 5
అలెక్సాలో జనరేటివ్‌ ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. అయితే ఈ సేవలు ఉచితంగా లభించవు. యూజర్లు ఇందుకోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏఐ సేవలను ఉపయోగించుకోవడానికి సుమారు రూ. 400 నుంచి రూ. 800 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

3 / 5
అమెజాన్‌ 2014లో తీసుకొచ్చిన నాటి నుంచి అలెక్సాలో తీసుకొచ్చిన పెద్ద మార్పు ఇదేనని చెప్పాలి. అలెక్సాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎన్నో అధునాతన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇది యూజర్లకు మరింత కచ్చితమైన సమాధానాలు ఇవ్వనుంది.

4 / 5
ఇప్పటి వరకు అలెక్సా అందించిన సేవలతో పోల్చితే ఈ ఏఐ సేవలు మరింత అధునాతన ఫీచర్లను అందించనున్నారు. ఆగస్టు నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు అమెజాన్‌ సన్నాహాలు చేస్తోంది.

5 / 5
గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఓపెన్‌ ఏఐ వంటి కంపెనీల నుంచి పెరుగుతోన్న పోటీ నేపథ్యంలో అమెజాన్‌ ప్రాజెక్ట్ బన్యాన్‌ పేరుతో అలెక్సాలో మార్పులు తీసుకొస్తోంది. ఇక కొత్త వెర్షన్‌తో యూజర్ల సంఖ్యను పెంచుకోవడంతో పాటు, ఆదాయం సమకూర్చే ఆలోచనలో కంపెనీ ఉంది.