OnePlus Tablet: గ్యాడ్జెట్‌ లవర్స్‌ గెట్‌ రడీ… వన్‌ప్లస్‌ నుంచి ట్యాబ్లెట్‌ వచ్చేస్తోంది. ధర తక్కువేనండోయ్‌..

|

Jan 09, 2023 | 1:39 PM

ఇప్పటి వరకు స్మార్ట్‌ ఫోన్స్‌, టీవీలకు పెట్టింది పేరైన వన్‌ప్లస్‌ నుంచి ట్యాబ్లెట్స్‌ రానున్నాయి. త్వరలోనే వన్‌ప్లస్‌ భారత్‌లో ట్యాబ్లెట్‌ను లాంచ్‌ చేయనున్నాయని తెలుస్తోంది. ఇంతకీ వన్‌ప్లస్‌ ట్యాబ్లెట్‌ ధర ఎంత.? ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రాన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ త్వరలోనే భారత మార్కెట్లోకి ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌టీవలతో బలమైన మార్కెట్‌ను ఏర్పర్చుకున్న వన్‌ప్లస్‌ తాజాగా ట్యాబ్లెట్స్‌ తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

2 / 5
ఈ ఏడాది మధ్యలో వన్‌ప్లస్‌ ట్యాబ్లెట్‌ లాంచ్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్‌ 11 ఆర్‌ స్మార్ట్‌ ఫోన్‌తో పాటు ఈ ట్యాబ్లెట్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. వన్‌ప్లస్‌ ప్యాడ్ లేదా వన్‌ప్లస్‌ ట్యాబ్‌ పేరుతో తీసుకురానున్నట్లు సమాచారం.

3 / 5
ఇక ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు వన్‌ప్లస్‌ ఈ ట్యాబ్లెట్‌ను బడ్జెట్‌ ధరలోనే లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. రూ. 20 వేలలోపు ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు.

4 / 5
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ట్యాబ్లెట్‌లో స్నాప్‍డ్రాగన్ 865 ప్రాసెసర్‌ను వన్‍ప్లస్ ట్యాబ్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. 2K రెజల్యూషన్ ఉండే 10.36 ఇంచుల IPS LCD డిస్‍ప్లేతో రానుందని సమాచారం.

5 / 5
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 7100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వన్‌ప్లస్‌ ఈ ఫీచర్లపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.