- Telugu News Photo Gallery Technology photos 50 megapixel camera in RS 7000 budget Infinix Smart 8 Plus features and price details
Infinix Smart 8 Plus: రూ. 7వేలలో 50 ఎంపీ కెమెరా.. సూపర్ స్మార్ట్ ఫోన్..
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి కెమెరాతో కూడిన ఫోన్‌లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. తమ అద్భుత క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకోవాలనే ఉద్దేశంతో మంచి కెమెరా క్లారిటీ ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే మంచి క్లారిటీ కెమెరా ఫోన్ కావాలంటే భారీగా డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. కానీ తక్కువ ధరలోనే మంచి ఫోన్ అందుబాటులో ఉంది..
Updated on: Jun 17, 2024 | 11:12 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ ఇటీవల వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇన్‌ఫినిక్స్ 8 ప్లస్ పేరుతో ఓ బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో తీసుకొచ్చారు. టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది.

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి36 ప్రాసెసర్‌ను అందించారు. అంతేకాకుండా ఇందులో IMG Power VR GE 8320 GPU వంటి పవర్‌ఫుల్ గ్రాఫిక్ కార్డును అందించారు. దీంతో మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందొచ్చు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. మ్యాజిక్ రింగ్ బెజెల్‌తో ఫ్లూయిడ్ పంచ్ హోల్ డిస్‌ప్లేను ఇచ్చారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకొచ్చారు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఆర్టిఫిషియల్ లెన్స్‌తో క్వాడ్ ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్ సపోర్ట్ ఈ కెమెరా సొంతం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ ధర రూ. 7,799కాగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 500 డిస్కౌంట్‌తో రూ. 7299కే లభిస్తోంది.




