
కావాల్సిన పదార్థాలు : కంది పప్పు, ఆవాలు , జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, ఆవాలు, వెల్లుల్లిపాయలు, చింత పండు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కారం వన్ టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, మెంతి పొడి, ధనియాల పొడి చిటికెడు, పసుపు చిటికెడు.

తయారీ విధానం : తమిళనాడు స్టైల్ ముద్ద పప్పు చారు కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 250 గ్రాముల కంది పప్పు తీసుకోవాలి. శుభ్రంగా కడికి, ఉడకడానికి సరిపడ నీళ్లు పో యాలి. తర్వాత టీ స్పూన్ నెయ్యి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు రెబ్బలు, పచ్చి మర్చి ముక్కలు, ఉప్పు, చిటికెడు పసుపు, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా ఉడకబెట్టుకోవాలి.

గ్యాస్ స్టవ్ మీద కుక్కర్‌లో వేసి కంది పప్పు బాగా ఉడికేలా చూసుకోవాలి. సుమారు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూడాలి. అప్పటి వరకు మెత్తగా పప్పు ఉడికిపోతుంది. ఇప్పుడు దానిని పప్పు దువ్వతో మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. దీంతో తమిళనాడు స్టైల్ ముద్ద పప్పు రెడీ.

ఇప్పుడు చారు రెడీ చేసుకోవాలి. ముందుగా చింత పండు నానబెట్టుకోవాలి. తర్వాత అందులో నుంచి రసం తీయాలి. ఆ చింత పండు రసం బాగా పులుపు లేకుండా చూసుకోవాలి. దీని తర్వాత అందులో రుచికి సరిపడ కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు మెంతి, ధనియాల పొడి వేయాలి. ఆతర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి. పాన్ పెట్టి అందులో నూనె పోయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు,చిటికెడు పసుపు, ఎండు మిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చింత పండు రసం వేయాలి. అంతే చారు రెడీ. టేస్టీ టేస్టీ తమిళనాడు స్టైల్ ముద్ద పప్పు చారు రెడీ.