Tamarind Pulihora : ప్రసాదం స్టైల్ చింతపండు పులిహోర.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది

|

Sep 11, 2024 | 5:12 PM

పులిహోర అంటే ఇష్టం ఉండని భోజన ప్రియులు ఎవరూ ఉండరు. ముఖ్యంగా.. రాత్రి వేళల్లో అన్నం మిగిలిపోతే.. పగలు దాన్ని పులిహోరాగా కలిపేస్తుటారు. చింతపండు అందుబాటులో లేకపోతే.. నిమ్మకాయను కలిపైనా సరే పులిహోరా చేసి తినేస్తుంటారు. కానీ, పులిహోర అనగానే గుడిలో ప్రసాదం గుర్తుకువస్తుంది. ఆ పులిహోర రుచే వేరుంటుంది కదా. కానీ ఎంత ట్రై చేసినా అలాంటి రుచి రాదు. కానీ కొన్ని సింపుల్ ట్రిక్స్ తో ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ రెసీపీని ఓసారి ట్రై చేయండి. ఇకపై మీ ఇంట్లో చేసిన చింతపండు పులిహోర టేస్ట్ అదిరిపోతుంది.

1 / 6
చింతపండు పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం, రెసీపీని ఓసారి ట్రై చేయండి. ఇకపై మీ ఇంట్లో చేసిన చింతపండు పులిహోర టేస్ట్ అదిరిపోతుంది. 
కావాల్సిన పదార్థాలు బియ్యం - 250 గ్రాములు, నూనె - పావు కప్పు, కరివేపాకు - 2 రెమ్మలు, పచ్చిమిర్చి - 3, పసుపు - 1 స్పూన్ , ఉప్పు - రుచికి తగినంత , చింతపండు - 50 గ్రాములు
నూనె - 2 స్పూన్లు, ఆవాలు - అర టీస్పూన్ , మెంతులు - 1 టీస్పూన్, కరివేపాకు -1 రెబ్బ, ఇంగువ - అర టీస్పూన్.

చింతపండు పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం, రెసీపీని ఓసారి ట్రై చేయండి. ఇకపై మీ ఇంట్లో చేసిన చింతపండు పులిహోర టేస్ట్ అదిరిపోతుంది. కావాల్సిన పదార్థాలు బియ్యం - 250 గ్రాములు, నూనె - పావు కప్పు, కరివేపాకు - 2 రెమ్మలు, పచ్చిమిర్చి - 3, పసుపు - 1 స్పూన్ , ఉప్పు - రుచికి తగినంత , చింతపండు - 50 గ్రాములు నూనె - 2 స్పూన్లు, ఆవాలు - అర టీస్పూన్ , మెంతులు - 1 టీస్పూన్, కరివేపాకు -1 రెబ్బ, ఇంగువ - అర టీస్పూన్.

2 / 6
తాళింపు కోసం: నూనె - పావు కప్పు, ఆవాలు - అర టీస్పూన్ , పల్లీలు - పావు కప్పు, మినపప్పు - 1 టేబుల్ స్పూన్, శనగపప్పు - 1 టేబుల్ స్పూన్, ఎండు మిర్చి - 5, కరివేపాకు - 1 రెబ్బ, ఆవాల మసాల కోసం, ఆవాలు - రెండు స్పూన్లు,ఎండు మిర్చి - 1, అల్లం - అంగుళం, ఉప్పు - రుచికితగినంత తీసుకోవాలి.

3 / 6
తయారీ విధానం: చింతపండు నానబెట్టి దాని నుంచి గుజ్జు తీయాలి. మసాలా కోసం ఆవాలు, ఎండుమిర్చి అల్లం, ఉప్పు పేస్టు చేసుకోవాలి. బియ్యం కడిగి ఉడికించుకోవాలి. స్టౌ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె పోయాలి. ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసి చింతపండు గుజ్జు వేయాలి.

4 / 6
చింతపండు ఉడికిన తర్వాత అందులో ముందుగా తయారు చేసుకున్న ఆవాల ముద్ద వేసి ఉడికించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. తయారు చేసుకున్న అన్నంలో తాళింపు వేసి బాగా కలపాలి.
స్టౌ వెలిగించి పావు కప్పు నూనె పోసి అందులో ఆవాలు చిటపటలాడనివ్వాలి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు , ఎండుమిర్చి, కరివేపాకు, వేసి అన్నంలో మిక్స్ చేయాలి. అంతే సింపుల్ పులిహోర రెడీ.

చింతపండు ఉడికిన తర్వాత అందులో ముందుగా తయారు చేసుకున్న ఆవాల ముద్ద వేసి ఉడికించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. తయారు చేసుకున్న అన్నంలో తాళింపు వేసి బాగా కలపాలి. స్టౌ వెలిగించి పావు కప్పు నూనె పోసి అందులో ఆవాలు చిటపటలాడనివ్వాలి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు , ఎండుమిర్చి, కరివేపాకు, వేసి అన్నంలో మిక్స్ చేయాలి. అంతే సింపుల్ పులిహోర రెడీ.

5 / 6
 అయితే, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంంటే.. పులిహొరకి తయారీ కోసం నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనె వాడితే ఎంతో కమ్మదనాన్ని ఇస్తుంది.

అయితే, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంంటే.. పులిహొరకి తయారీ కోసం నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనె వాడితే ఎంతో కమ్మదనాన్ని ఇస్తుంది.

6 / 6
మీరు నూనెకు బదులుగా నెయ్యిని ఉపయోగించవచ్చు. అన్నంలో రసం కలుపుతూ నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి పులిహోరకు మరింత కమ్మదనాన్ని అందిస్తుంది.

మీరు నూనెకు బదులుగా నెయ్యిని ఉపయోగించవచ్చు. అన్నంలో రసం కలుపుతూ నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి పులిహోరకు మరింత కమ్మదనాన్ని అందిస్తుంది.