వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇమ్యూనిటీని డబుల్ చేసే చింత తొక్కు చిత్రాన్నం.. పుల్లగా, కారంగా..

Updated on: Jun 28, 2026 | 7:52 AM

చిత్రాన్నం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చింతపండుతో కానీ, నిమ్మరసంతో కానీ దీనిని చేస్తారు. పుల్ల పుల్లగా తినడానికి టేస్టీగా ఉండే సూపర్ రెసిపీ. అయితే, ఈ సారి కొత్తగా చింత తొక్కుతో చేస్తే రుచి అదిరిపోతోంది. కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

 చింత తొక్కు చిత్రాన్నంకు కావాల్సిన పదార్థాలు: రెండు  కప్పుల అన్నం, ఒక టేబుల్ స్పూన్ చింత తొక్కు,  అర టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు, కొద్దిగా పల్లీలు, జీడిపప్పు, నాలుగు పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ నిమ్మరసం, పచ్చి కొబ్బరి , మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్, పోపు గింజలు,  ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర , ఎండుమిర్చిని తీసుకోవాలి.

3 / 5
 చింత తొక్కు చిత్రాన్నం తయారీ విధానం:  ముందుగా రెండు కప్పుల వేడి అన్నాన్ని తీసుకుని ఉండలు లేకుండా కలుపుకుని దానిలో కొంచం పసుపు వేసి మంచిగా కలువుకోవాలి. ఇక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని కలపాలి. ఇలా చేస్తే మంచి రుచి వస్తుంది. ఇక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుని కొద్దీ సేపు పక్కన పెట్టుకోవాలి.

4 / 5
చింత తొక్కు చిత్రాన్నం తయారీ విధానం స్టెప్ 1 : ఇక ఇప్పుడు చింత తొక్కును  సిద్ధం చేసుకోవాలి. రెండు చింత కాయలను తీసుకుని వాటిని బాగా  కడిగి  మిక్సీ పట్టుకోవాలి. ఇంకా దీనిలో  కొబ్బరి , ఎండుమిర్చి,నాలుగు  ధనియాలు, చిటికెడు పసుపు వేసి, నీళ్లు కూడా  పోసి పేస్ట్‌లా చేసుకుని మెత్తగా పట్టుకోవాలి.

5 / 5
చింత తొక్కు చిత్రాన్నం : పాన్ లో చేసి నూనె వేసి ఆవాలు, కొద్దిగా  జీలకర్ర, మినపప్పు వేసి వేయించాలి. పల్లీలు, కరివేపాకు,నాలుగు  పచ్చిమిర్చి ముక్కలు  కూడా వేసి వేయించుకోవాలి. అలాగే చింత తొక్కును వేసి పచ్చి వాసన పోయాక ముందుగా పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసి కలుపుకోవాలి. అంతే, వేడి వేడి చింత తొక్కు చిత్రాన్నం రెడీ.

Follow Us