చింతచెట్టు ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ చుండ్రు గుణాలు ఉన్నాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి తెల్ల జుట్టు నల్లగా మారడానికి చింతచెట్టు ఆకు హెయిర్ స్ప్రేని ఉపయోగించండి.
స్ప్రే సిద్ధం చేయడానికి ముందుగా ఒక గిన్నెలో 5 కప్పుల నీటిని తీసుకుని, అరకప్పు చింత చెట్టు ఆకులను కలపండి. ఇప్పుడు రెండింటినీ కలిపి బాగా ఉడికించాలి. చల్లారిన తర్వాత మీ జుట్టు మీద స్ప్రే చేయండి. కొద్దిసేపు అలాగే వదిలేసి శుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి.
చింతచెట్టు ఆకు హెయిర్ ప్యాక్ చేయడానికి పెరుగులో కొన్ని ఆకులను మిక్స్ చేసి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయండి. పూర్తిగా ఆరిన తర్వాత నీటితో కడగాలి.
కొన్ని వారాల పాటు చింతచెట్టు ఆకులను ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా మారడమే కాకుండా జుట్టు రాలడం, జుట్టు పొడిబారడం, బలహీనత వంటి సమస్యలన్నీ దూరమవుతాయి.
చింత ఆకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణం జుట్టుకు రక్షణను ఇస్తుంది. జుట్టు రాలడం, జుట్టు చిట్లిపోయే సమస్యను తొలగిస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. సహజమైన కలరింగ్ ఏజెంట్ చింతపండులో ఉంటుంది.