
స్థిరమైన శక్తి బూస్ట్ :ఈ బ్రేక్‌ఫాస్ట్ కోసం వాడే మూడు పదార్థాల్లో అనేక పోషకాలు ఉంటాయి. చిలకడదుంపలో బీటా-కెరోటిన్, పాలలోని కాల్షియం, బెల్లంలోని ఇనుము సమృద్దిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. చిలగడదుంపల నుండి వచ్చే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు (100 గ్రాములకు 20 గ్రా) గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తాయి, ఇది ఉదయం క్రాష్‌లను నివారిస్తుంది, అలాగే పాలలో ఉండే ప్రోటీన్లు మన రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రిస్తాయి. బెల్లంలో ఉండే ఇనుము శరీరంలో ఆక్సిజన్ సరపరాను మెరుగుపరుస్తుంది. ఈ బ్రేక్ ఫాస్ట్ మీకు 4-5 గంటల పాటు శక్తిని ఇస్తోంది.

రోగనిరోధక శక్తి పెంచుతుంది: చిలగడదుంపలలోని బీటా-కెరోటిన్ విటమిన్ A ఉంటుంది. ఇది కళ్ళను రక్షిస్తుంది అలాగే ఇన్ఫెక్షన్ల నుండి రక్షించేందుకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అలాగే పాలలో ఉండే విటమిన్ D మన కణాలను రక్షిస్తుంది. ఇక బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొని శీతాకాలపు జలుబులను తగ్గిస్తాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సహజంగానే మన శరీరంలో రోగనిరోధక స్థాయిలు పెరిగి మనల్ని ఎలాంటి అనారోగ్య సమస్యల భారీన పడకుండా చేస్తుంది.

జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చడం: చిలగడదుంపలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించి, పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే దీన్ని వేడివేడిగా చేసుకోని తినడం వల్ల కడుపునకు ఎంతో ఉపశమనంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: ఉడికించిన చిలకడదుపంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను స్థిరీకరిస్తుంది, అందుకే ఈ బ్రేక్‌ఫాస్ట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే పొటాషియం ఒత్తిడిని నియంత్రిస్తుంది, ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బెల్లంలోని ఖనిజాలు చక్కెర వల్ల కలిగే హానిని తొలగిస్తాయి. అయితే పాలలో ఉండే కొవ్వు పదార్థాలు మన గుండెకు రక్షణ కల్పిస్తాయి. ఇది హృదయ సంబంధ ప్రమాదాలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.

కండరాల బలం: పాలలో క్యాల్సియం, విటమిన్ డి ఉంటాయి. ఇవి చిలగడదుంపలోని పొటాషియంతో (337mg) జతకట్టి తిమ్మిరిని నివారించి కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. బెల్లం హిమోగ్లోబిన్ కోసం ఇనుము శోషణను పెంచుతుంది, ఇది అలసటను ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది.