శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయంలో కుంకుమార్చన మహాయజ్ఞం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

|

Aug 12, 2024 | 12:20 PM

స్వామి అభిషేక బ్రహ్మచారి.. దేశం పురోగతి, ప్రపంచంలో శాంతి స్థాపన కోసం తల్లి లలితాను ప్రార్థించారు. అయోధ్యలో శ్రీరాముడి మహా మందిరాన్ని చూడడం ప్రతి సనాతనీ గర్వించదగ్గ తరుణమని అన్నారు. మహాయజ్ఞంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

1 / 6
సికింద్రాబాద్‌లోని శ్రీ సుబ్రమణ్యం స్వామి దేవాలయం స్కందగిరి మఠంలో... స్వామి అభిషేక బ్రహ్మచారి ఆధ్వర్యంలో శ్రీ విద్యాకోటి కుంకుమ అర్చన మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 11-13 వరకు జరిగే మహాయజ్ఞం వినాయకుని ఆరాధనతో ప్రారంభమైంది. అంబిక, వరుణ పూజ, మాతృక పూజ, గురు పాదుకా పూజ,.. గణపతి సహస్రార్చనను వేదమంత్రోచ్ఛరణలతో నిర్వహించారు.

2 / 6
స్వామి అభిషేక బ్రహ్మచారి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరినీ గౌరవించాలని, అన్యాయం, అసత్యంపై పోరాడాలని సనాతన ధర్మం నేర్పుతుందన్నారు. ప్రపంచం మొత్తం నేడు మన దేశం వైపు చూస్తోందని అన్నారు. స్వామి అభిషేక బ్రహ్మచారి మాట్లాడుతూ ఇది రాజకీయాలకు సమయం కాదని, సేవ చేయాల్సిన సమయం అని అన్నారు. సనాతనాన్ని ఎవరు వ్యతిరేకించినా తుడిచిపెట్టుకుపోతారన్నారు.

3 / 6
స్వామి అభిషేక బ్రహ్మచారి.. దేశం పురోగతి, ప్రపంచంలో శాంతి స్థాపన కోసం తల్లి లలితాను ప్రార్థించారు. అయోధ్యలో శ్రీరాముడి మహా మందిరాన్ని చూడడం ప్రతి సనాతనీ గర్వించదగ్గ తరుణమని అన్నారు. మహాయజ్ఞంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, బీజేపీ సీనియర్‌ నేత మురళీధర్‌రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్‌ న్యాయవాది ఎన్‌. రామచంద్రరావు, పలువురు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

4 / 6
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.రాజేశ్వర్ రావు కూడా మహాయజ్ఞానికి హాజరయ్యారు. ఉదయం నుంచి ప్రసాద వితరణ ప్రారంభమైంది.. తెలంగాణతోపాటు పలు నగరాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

5 / 6
యువచేతన జాతీయ కన్వీనర్ రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. 2047 నాటికి దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని.. లలితా మాత ఆశీస్సులు, ప్రజల కృషితో దేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్నారు..

6 / 6
ఈ కార్యక్రమంలో పి.నవీన్ రావు, సుధాకర్ శర్మ, జయపాల్ సింగ్ నాయల్, రోహిత్ చౌదరి, కె. హరినాథ్, కృష్ణన్ రాజమణి, సౌరభ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. తల్లి లలితను ప్రసన్నం చేసుకునేందుకు భరతనాట్యం, భజనలు, దాండియాలను కూడా ప్రదర్శించారు.