చూసేందుకు చిన్నవే.. కానీ, రోజూ తిన్నారంటే మీ పేగులను శుభ్రం చేసే బుల్లెట్స్‌ అనాల్సిందే..!

Updated on: Aug 02, 2025 | 2:35 PM

చియా విత్తనాలు ఆరోగ్యానికి మంచివి. వీటిని తింటే శరీరం కూల్‌గా ఉంటుంది. ఈ చియా గింజలను జ్యూస్‌లో లేదా తాగే నీటిలో, జ్యూస్‌లలో కలిపి రోజూ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చియా విత్తనాల్లో పోషకాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల సమతల ఆహారం తీసుకున్నట్టు అవుతుందని అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
చియా సీడ్స్.. బరువు తగ్గటానికి చాలా మంది చియా సీడ్స్ తింటుంటారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ చిన్న విత్తనాలు బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చియా సీడ్స్‌ను వాటర్‌లో వేస్తే జెల్ మాదిరి అవుతాయి. ఇవి పేగులను శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ పేగులు క్లీన్ అవ్వాలంటే చియా సీడ్స్ నానబెట్టిన వాటర్ తాగడం మంచిది.

2 / 5
చియా గింజలను ఎప్పుడూ నేరుగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు.. ఎందుకంటే అవి నీటిని పీల్చుకుంటాయి. గొంతు లేదా కడుపులో చిక్కుకుపోతాయి. దీనివల్ల ఊపిరాడకపోవడం, మలబద్ధకం, కడుపు నొప్పి వస్తుంది. అందుకే వాటిని ఎల్లప్పుడూ నీరు, పాలు లేదా ఏదైనా ద్రవంలో నానబెట్టిన తర్వాత తినాలని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
చియా విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా దొరుకుతుంది. దీనిని తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఎముకలకు మంచిది.

4 / 5
Chia seeds

Chia seeds

5 / 5
అయితే, ఏదైనా అతిగా తినటం వల్ల అనర్థాలు తప్పవని అంటారు. అలాగే, చియా విత్తనాలను కూడా ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం, కడుపుబ్బరం సమస్యలు వస్తాయి. తక్కువ రక్తపోటు ఉన్నవారు దీనిని తీసుకోవడం ద్వారా వారి రక్తపోటు మరింత తగ్గవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.