
గుడ్డు: పురుషులలో ఎక్కువ స్పెర్మ్ ఉత్పత్తి చేయడానికి గుడ్లు సహాయపడతాయి. అలాగే గుడ్డును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది.

టమాటా: టమాటాల్లో విటమిన్ సి, లైకోపీన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్పెర్మ్ కౌంట్‌ను మెరుగుపరుస్తాయి.

అరటిపండు: దీనిలో మెగ్నీషియం, విటమిన్ బి1, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే స్పెర్మ్ ఉత్పత్తి పెరుగుతుంది. అరటిపండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు సహాయపడుతుంది.

దానిమ్మ: పండులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రవాహంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. దీంతోపాటు స్పెర్మ్‌కు హాని కలగకుండా కాపాడతాయి.

వెల్లుల్లి: వెల్లుల్లిలోని సెలీనియం అనే ఎంజైమ్ స్పెర్మ్ మొబిలిటీని పెంచడానికి సహాయపడుతుంది.

పాలకూర: పాలకూరలోని పోలీ ఎలిమెంట్స్ స్పెర్మ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

బెర్రీస్: స్ట్రాబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, క్రాన్‌బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బెర్రీలలోని శోథ నిరోధక లక్షణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి అవసరమైన రక్షణను అందించి.. ఆరోగ్యకరమైన స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు సహాయపడతాయి.

క్యారెట్: ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ హానిని నివారించి.. మీ స్పెర్మ్ కౌంట్‌ను పెంచేందుకు యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.