
ఫ్రూట్ షేక్స్ పండ్ల వంటి పోషక పదార్ధాలతో తయారు చేయబడినప్పటికీ.. ఆరోగ్యానికి మంచిదా కాదా అనే అనే ప్రశ్న కొందరిలో కలుగుతూ ఉంటుంది. అయితే ఫ్రూట్ షేక్స్ విషయంలో ఆహార పదార్థాల కలయికలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లలో పాలను కలిపే సమయంలో తప్పని సరిగా జాగ్రత్త తీసుకోవాలి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం కొన్ని రకాల పండ్లు, పాల కలయిక ఆమా అనే విషపూరిత పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తాయి.

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం మిల్క్ షేక్స్ ఆరోగ్యానికి హానికరం. కంపెనీలు హెల్తీ డ్రింక్స్ పేరుతో ప్రజలకు వీటిని అందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను, పాలను అసలు కలపకూడదు అని అంటున్నారు.

పాలలో అస్సలు కలపకూడని కొన్ని పండ్లు ఉన్నాయి. నిమ్మ, నారింజ, ద్రాక్ష, బొప్పాయి, పుచ్చకాయ వంటి ఫ్రూట్ మిల్క్ షేక్స్ శరీరానికి మంచిది కాదు.

ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలువబడే విటమిన్ సి, పాల ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయగల యాసిడ్ సమ్మేళనం అని పరిశోధనలో తేలింది.

ఫలితంగా పాలు ఆరోగ్యానికి హానికరం అయ్యే అవకాశం ఉంది. పాలలోని పోషక విలువలు కూడా పోతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఏదైనా పండ్లను పాలలో చేర్చడం పాలు విరుగుతాయి.

యాపిల్, చెర్రీ, స్ట్రాబెర్రీ, అనాస పండు, పియర్, జామలో ఉండే పోషకాలు మీ శరీరానికి అందాలనుకుంటే పాలలో వీటిని అస్సలు కలపవద్దు. ఇలా చేయడం వలన అజీర్ణం, పొత్తికడుపు నొప్పి, గుండెల్లో మంట, తిమ్మిర్లు, అసిడిటీ, విరేచనాలకు కారణమవుతుంది.