
అలోవెరా ఫేస్ ప్యాక్: ఇందులో ఉండే యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఇందులోని హైడ్రేటింగ్ గుణాలు చర్మంలో తేమను ఎక్కువ కాలం ఉంచుతాయి. కలబందను నేరుగా అప్లై చేయడం ద్వారా స్కిన్‌ను ముఖాన్ని తాజాగా ఉంచుకోవచ్చు.

అరటి, తేనె: ఈ రెండూ చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయి. ఒక గిన్నెలో అరటిపండును మెత్తగా చేసి అందులోకి ఒక చెంచా తేనె కలపండి. ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వాలి. కొద్ది సేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.

కాఫీ ఫేస్ ప్యాక్: వేసవిలో చర్మం ఎక్కువగా పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. దీనిని నివారించాలంటే కాఫీ ఫేస్ ఫ్యాక్ ఉత్తమం. కాఫీలో ఉండే గుణాలు చర్మాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచుతాయి. కాఫీలో కాస్త తేనె మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే డ్రై స్కిన్ సమస్యలు తగ్గుతాయి.

వేసవిలో డీహైడ్రేషన్ చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖం మెరుపును కోల్పోతుంది. ఈక్రమంలో కొన్ని సహజ చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

పెరుగు, క్రీమ్: చర్మ సంరక్షణలో పెరుగు సమర్థంగా పనిచేస్తుంది. దీనిని ముఖానికి పట్టించడం వల్ల ముఖంలో మెరుపు కూడా సంతరించుకుంటుంది. ఒక గిన్నెలో మూడు నుంచి నాలుగు చెంచాల పెరుగు తీసుకుని దానికి ఒక చెంచా ఫ్రెష్ క్రీమ్ కలపండి. ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వండి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోండి.