
కొబ్బరి నూనె: కొబ్బరి నూనె కూడా అండర్ ఆర్మ్స్ వాసనను తొలగించడంలో ఉత్తమమైనదిగా పేర్కొంటున్నారు నిపుణులు. కొద్దిగా కొబ్బరి నూనెను అండర్ ఆర్మ్స్‌కి అప్లై చేయాలి. కొన్ని నిమిషాల పాటు ఉంచిన తరువాత చల్లటి నీతిలో క్లీన్ చేయాలి.

నిమ్మకాయ: చర్మ సంరక్షణలో నిమ్మకాయ చాలా ఉత్తమమైనది. అండర్ ఆర్మ్స్ దుర్గంధంతో పాటు, అండర్ ఆర్మ్స్‌లో ఏర్పడే డార్క్‌నెస్‌ను కూడా తొలగిస్తుంది. ఒక టీస్పూన్ నిమ్మరసంలో అర టీస్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేసి, ఈ పేస్ట్‌ను చేతుల కింద భాగంలో అప్లై చేయాలి. కాసేపటి తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి.

బంగాళదుంప ముక్కలు: చంకల్లో చెమట ద్వారా వచ్చే దుర్వాసనను తొలగించడానికి బంగాళదుంప అద్భుతంగా పని చేస్తుంది. ఒక బంగాళాదుంప ముక్కను తీసుకుని, కాసేపు చంకలో పెట్టి ఉంచాలి. ఇది చెమట దుర్గంధం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

టొమాటో జ్యూస్: అండర్ ఆర్మ్స్ చెమట దుర్గంధాన్ని తొలగించడంలో టొమాటో జ్యూస్ అద్భుతంగా పని చేస్తుంది. టొమాటో జ్యూస్‌ని అండర్ ఆర్మ్స్‌పై కాటన్‌తో అప్లై చేయాలి. అలా చేయడం ద్వారా చెమట దుర్గంధం నుంచి ఉపశమనం కలుగుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్: యాపిల్ సైడర్ వెనిగర్ అండర్ ఆర్మ్స్ దుర్వాసన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒక గిన్నెలో కొంచెం నీరు తీసుకుని దానికి రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ వేయాలి. ఆ పేస్ట్‌ని అండర్ ఆర్మ్స్‌కు అప్లై చేయాలి. ఈ రెసిపీతో మంచి ఫలితం ఉంటుందని బ్యూటీషియన్స్ చెబుతున్నారు.