ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!

Updated on: Jul 27, 2026 | 6:14 PM

Udupi Temple Tradition: కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ మఠంలో భక్తులు నేలపై కూర్చొని అన్నప్రసాదం ఎందుకు స్వీకరిస్తారో తెలుసా? కనకదాసుడి భక్తి, నవగ్రహ కిండి ద్వారా దర్శనం, సమానత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ 800 ఏళ్ల పవిత్ర సంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోండి.

1 / 5
కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి నగరంలో వెలసిన ‘శ్రీకృష్ణ మఠం’ హిందువుల అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి. శ్రీకృష్ణుడికి అంకితమైన ఈ ఆలయం ద్వైత వేదాంత స్థాపకుడు శ్రీ మధ్వాచార్యులు 13వ శతాబ్దంలో స్థాపించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. నేటికీ ఈ మఠం ఒక జీవంతమైన ఆశ్రమంలా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ భక్తులు శ్రీకృష్ణుడిని నేరుగా కాకుండా వెండి పూతతో అలంకరించిన ప్రత్యేక కిటికీ ద్వారా దర్శించుకోవడం. అంతేకాదు, వేలాది మంది భక్తులకు ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదం అందించడం, అలాగే భక్తులు నేలపై కూర్చొని ప్రసాదం స్వీకరించే సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

2 / 5
వెండి కిటికీ ద్వారా శ్రీకృష్ణుడి దర్శనం ఎందుకు?.. ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలోని విగ్రహాన్ని 'నవగ్రహ కిండి' అనే వెండి పూతతో అలంకరించిన తొమ్మిది రంధ్రాల కిటికీ ద్వారా దర్శిస్తారు. దీనికి సంబంధించిన ఒక ప్రసిద్ధ గాథ ఉంది. పూర్వకాలంలో మహాభక్తుడైన కనకదాసు సామాజిక ఆంక్షల కారణంగా ఆలయంలోకి  ప్రవేశించలేకపోయాడు. అయినప్పటికీ ఆలయం వెలుపల నిలబడి హృదయపూర్వకంగా శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు. అతని అపార భక్తికి పరవశించిన శ్రీకృష్ణుడు తన విగ్రహాన్ని కనకదాసు ఉన్న దిశగా తిరిగాడని,  ఆలయ గోడలో ఒక చిన్న రంధ్రం ఏర్పడిందని విశ్వసిస్తారు. ఆ రంధ్రాన్నే నేడు 'కనకన కిండి' అని పిలుస్తారు. అప్పటి నుంచి భక్తులు లోపలి నవగ్రహ కిండి, వెలుపలి కనకన కిండి ద్వారా శ్రీకృష్ణుడిని దర్శించుకోవడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోంది.

3 / 5
ఉడుపి శ్రీకృష్ణ మఠం ప్రత్యేకతలు.. ఈ ఆలయం ప్రతి రోజు ఉదయం 5:30 గంటలకు తెరుచుకుంటుంది. మధ్యాహ్నం భక్తులకు పవిత్రమైన అన్నప్రసాదం అందజేస్తారు. వేలాది మంది భక్తులకు ప్రతిరోజూ ఉచిత భోజనం అందించే ఈ ఆలయాన్ని ప్రేమగా 'అన్న బ్రహ్మ' అని కూడా పిలుస్తారు. ఇక్కడ మరో విశేషం అష్టమఠ వ్యవస్థ. ఎనిమిది మఠాలు క్రమపద్ధతిలో ఆలయ పూజా కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను చేపడతాయి. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది.

4 / 5

ఉడుపి ఆలయంలో భక్తులు నేలపై కూర్చొని ప్రసాదం ఎందుకు భుజిస్తారు?.. 
ఉడుపి శ్రీకృష్ణ మఠంలో భక్తులు నేలపై కూర్చొని అన్నప్రసాదం స్వీకరించడం కొత్త సంప్రదాయం కాదు. దాదాపు 800 సంవత్సరాలుగా కొనసాగుతున్న పవిత్ర ఆచారం ఇది. దీని వెనుక ఒక విశ్వాసం ఉంది. మనస్ఫూర్తిగా శ్రీకృష్ణుడిని ప్రార్థించి కోరుకున్న కోరిక నెరవేరితే, కృతజ్ఞతగా భక్తులు ఆలయంలో నేలపై కూర్చొని..  అన్నప్రసాదంను కూడా నేలపైనే ఉంచి   స్వీకరిస్తారు. దీనిని వారు  దైవానుగ్రహానికి గుర్తుగా భావిస్తారు. అలాగే ఈ సంప్రదాయానికి మరో గొప్ప ఆధ్యాత్మిక సందేశం కూడా ఉంది. ధనిక–పేద, ఉన్నత–తక్కువ అనే భేదాలు లేకుండా అందరూ ఒకే వరుసలో నేలపై కూర్చొని ఒకే విధమైన ప్రసాదాన్ని స్వీకరిస్తారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులనే సందేశాన్ని ఈ ఆచారం ప్రతిబింబిస్తుంది.

ఉడుపి ఆలయంలో భక్తులు నేలపై కూర్చొని ప్రసాదం ఎందుకు భుజిస్తారు?.. ఉడుపి శ్రీకృష్ణ మఠంలో భక్తులు నేలపై కూర్చొని అన్నప్రసాదం స్వీకరించడం కొత్త సంప్రదాయం కాదు. దాదాపు 800 సంవత్సరాలుగా కొనసాగుతున్న పవిత్ర ఆచారం ఇది. దీని వెనుక ఒక విశ్వాసం ఉంది. మనస్ఫూర్తిగా శ్రీకృష్ణుడిని ప్రార్థించి కోరుకున్న కోరిక నెరవేరితే, కృతజ్ఞతగా భక్తులు ఆలయంలో నేలపై కూర్చొని.. అన్నప్రసాదంను కూడా నేలపైనే ఉంచి స్వీకరిస్తారు. దీనిని వారు దైవానుగ్రహానికి గుర్తుగా భావిస్తారు. అలాగే ఈ సంప్రదాయానికి మరో గొప్ప ఆధ్యాత్మిక సందేశం కూడా ఉంది. ధనిక–పేద, ఉన్నత–తక్కువ అనే భేదాలు లేకుండా అందరూ ఒకే వరుసలో నేలపై కూర్చొని ఒకే విధమైన ప్రసాదాన్ని స్వీకరిస్తారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులనే సందేశాన్ని ఈ ఆచారం ప్రతిబింబిస్తుంది.

5 / 5
అన్నప్రసాదం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం.. హిందూ సంప్రదాయంలో అన్నదానాన్ని మహాదానంగా భావిస్తారు. ఉడుపి శ్రీకృష్ణ మఠంలో అందించే అన్నప్రసాదం కేవలం భోజనం మాత్రమే కాదు, అది భక్తి, సమానత్వం, సేవాభావం, వినయం వంటి విలువలకు ప్రతీకగా నిలుస్తుంది. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఈ పవిత్ర సంప్రదాయంలో పాల్గొని శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు.

(Discliamer: ఉడుపి శ్రీకృష్ణ మఠంలో భక్తులు నేలపై కూర్చొని అన్నప్రసాదం స్వీకరించే సంప్రదాయం భక్తి, సమానత్వం, సేవాభావానికి ప్రతీకగా భావించబడుతుంది. అలాగే కనకన కిండి ద్వారా శ్రీకృష్ణుడిని దర్శించుకోవడం కనకదాసుడి అపార భక్తిని స్మరింపజేసే విశిష్ట ఆచారంగా నేటికీ కొనసాగుతోంది. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.)

అన్నప్రసాదం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం.. హిందూ సంప్రదాయంలో అన్నదానాన్ని మహాదానంగా భావిస్తారు. ఉడుపి శ్రీకృష్ణ మఠంలో అందించే అన్నప్రసాదం కేవలం భోజనం మాత్రమే కాదు, అది భక్తి, సమానత్వం, సేవాభావం, వినయం వంటి విలువలకు ప్రతీకగా నిలుస్తుంది. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఈ పవిత్ర సంప్రదాయంలో పాల్గొని శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు. (Discliamer: ఉడుపి శ్రీకృష్ణ మఠంలో భక్తులు నేలపై కూర్చొని అన్నప్రసాదం స్వీకరించే సంప్రదాయం భక్తి, సమానత్వం, సేవాభావానికి ప్రతీకగా భావించబడుతుంది. అలాగే కనకన కిండి ద్వారా శ్రీకృష్ణుడిని దర్శించుకోవడం కనకదాసుడి అపార భక్తిని స్మరింపజేసే విశిష్ట ఆచారంగా నేటికీ కొనసాగుతోంది. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.)

Follow Us