మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశినాథుడు శని ధన స్థానంలో ఉండడం, తృతీయంలో రాహువు, లాభ స్థానంలో బుధుడు, సొంత రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల కీలక విషయాల్లో జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపో తుంది. కొత్త ప్రయత్నాలు, కార్యక్రమాలు విజయవంతంగా నెరవేరుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నా లకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారు. ప్రతిభా పాట వాలకు సర్వత్రా గుర్తింపు లభిస్తుంది. తరచూ శివార్చన చేయించడం వల్ల మేలు జరుగుతుంది.