
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శుభ గ్రహాల అనుకూలత వల్ల వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు బాగా వృద్దిలోకి వస్తారు. ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ధన లాభం ఉంటుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలను, కొత్త వ్యూహాలను అమలు చేసి, ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆర్థికంగా వాగ్దానాలు చేయడానికి, ఉచిత సహాయాలు చేయడానికి ఇది ఏమాత్రం సమయం కాదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ వారం శుభవార్తలు ఎక్కువగా వింటారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకోవడం వెళ్లడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగా మెరుగ్గా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శుభ గ్రహాల అనుకూలత వల్ల ఈ వారమంతా సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల్లో మాటకు విలువ పెరుగుతుంది. శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలమీద మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ వారమంతా ధన స్థానం బాగా బలంగా ఉండడం వల్ల ఆదాయానికి లోటుండదు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. మాటకు విలువ పెరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాబిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పక పోవచ్చు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యుల మీద కొద్దిగా ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ఒక వ్యక్తిగత సమస్యకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. బంధుమిత్రులతో వాదోప వాదాలకు దిగవద్దు. మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): అష్టమ శని ప్రభావం వల్ల ఇంటా బయటా ఒత్తిడి, ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ సంబంధమైన చికాకులుంటాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. వ్యాపారాలు నిదానంగా పురోగమిస్తాయి. కొద్దిపాటి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం, ఎవరినీ నమ్మకపోవడం మంచిది. ఆదాయ వృద్ధికి కొత్త ప్రయత్నాలను చేపడ తారు. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక, ఆస్తి వ్యవ హారాలను చక్కబెడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలలో, ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): గురు, శుక్ర, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్వయం ఉపాధి, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. గతంలో మీ సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. అదనపు ఆదాయానికి ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అంది వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య, వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో వాగ్వాదాలు తలెత్తకుండా జాగ్రత్త పడడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): శుభ గ్రహాల బలం బాగా ఎక్కువగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభించే అవ కాశం ఉంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగులు ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారాలలో కొన్ని ప్రధానమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో ఆస్తి, ఆర్థిక వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందుతాయి. కుటుంబ జీవితం చాలా వరకు హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వారమంతా కొద్దిగా మిశ్రమ ఫలితాలతో సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో లక్ష్యాలను పూర్తి చేయడంలో వెనుకబడతారు. కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాల పరిస్థితి నిలకడగానే ఉంటుంది. కొన్ని కుటుంబ సంబంధమైన ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అదనపు ఆదాయానికి లోటుండకపోవచ్చు. కొందరు ఇష్టమైన మిత్రులతో సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1): గురు, బుధుల బలం బాగా ఎక్కువగా ఉన్నందువల్ల ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మీ సమర్థత బాగా వెలుగులోకి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికాభివృద్ధికి, ఆర్థిక వ్యవహారాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. పిల్లలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): తృతీయ స్థానంలో ఉన్న రాశ్యధిపతి శని కారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభి స్తుంది. ఉత్సాహంతో లక్ష్యాలను, బాధ్యతలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మిత్రులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు బంధువుల వల్ల డబ్బు నష్టపోయే అవ కాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఏలిన్నాటి శని కారణంగా ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. కుటుంబ జీవితం కూడా సాఫీగా గడిచిపోతుంది. ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశం ఉంది. భారీ లక్ష్యాల కారణంగా ఇబ్బంది పడతారు. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు ఇష్ట మైన మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనుకున్న పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, మద్యం, రాజకీయాలు, ఇతర వ్యాపారాల్లో ఉన్నవారికి సంపా దన పెరుగుతుంది. కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమణుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వారమంతా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందు తుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు, కొద్దిగా ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా ఆశించిన లాభాలు కనిపిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలను చాలావరకు తగ్గించుకుంటారు. దగ్గర బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. రావలసిన సొమ్ముతో పాటుబాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.