5 / 7
ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు కూడా చిన్న వయస్సులో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. రాజన్నకు మొక్కుకోవడంతో ఆరోగ్యం బాగుపడింది. శివపార్వతిగా మారిపోయాడు.. ఇంటర్మీడియట్ వరకు చదివి ఆపేశాడు. చాలా మంది ఎగతాళి చేయడంతో.. కళాశాలకు వెళ్లలేకపోయాడు. ఈ యువకుడు వేములవాడకు వెళ్తే అమ్మవారి లాగా తయారై మొక్కులు చెల్లించుకుంటాడు. ఇంటి వద్ద ఉంటే మెట్టెలు, తాళి ధరిస్తాడు. ప్రతి నిత్యం దేవుడి సేవలో గడుపుతున్నాడు. అదే విధంగా.. మరో యువకుడు చిన్న వయస్సులో తీవ్రమైన అనారోగ్యానికి గురి కావడంతో శివపార్వతిగా మారిపోయి.. భవానిగా పేరు మార్చుకున్నాడు. పూర్తిగా.. అమ్మవారి అవతారంలో ఉంటున్నాడు... ఇంట్లో వద్దని చెప్పినా.. శివపార్వతిగా మారిపోయాడు. రాము అనే యువకుడు కూడా శివపార్వతిగా మారిపోయాడు.. మగవారి డ్రెస్ ధరించినా చేతికి గాజులు వేసుకుంటాడు, మెట్టెలు ధరిస్తున్నాడు. దేవుడి కోరిక మేరకే శివపార్వతిలాగా మారిపోయాయని అంటున్నాడు. తమ వంశీయులు కూడా. శివపార్వతులు ఉన్నారని చెబుతున్నాడు