జ్యోతిషశాస్త్రం ప్రకారం, 6,8, 12 రాశుల అధిపతులు వారి వారి రాశుల్లో ఉన్నా లేక ఒకరి స్థానంలో మరొకరు ఉన్నా విపరీత రాజయోగం పడుతుంది. ఇందులో ఏ ఒక్క అధిపతి ఇతర రెండు రాశుల్లో ఉన్నా ఈ యోగం పడుతుంది. అంటే, ఆరవ స్థానాధిపతి 8లో గానీ, 12లో గానీ ఉండడం అన్న మాట. ఈ విపరీత రాజయోగం వల్ల ఎంతటి సాధారణ వ్యక్తికైనా ఆకస్మిక ధన లాభం గానీ, ఆకస్మిక పదవీ యోగం గానీ,
ఆకస్మిక గౌరవమర్యాదలు పొందడం గానీ జరుగు తుంది. ప్రస్తుతం రెండు మూడు నెలల పాటు ఏడు రాశుల వారికి, మేషం, వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి, ఈ యోగం పడుతోంది. ఈ విపరీత రాజయోగం ఈ రాశులకు ఏ విధంగా వర్తిస్తుందో, ఏం జరుగుతుందో ఇక్కడ పరిశీలిద్దాం.