Vinayaka Chavithi 2025: గణేష్ చతుర్థి నాడు గ్రహాల ప్రత్యేక కలయిక.. ఈ రాశుల వారికి స్వర్ణకాలం ప్రారంభం

Updated on: Aug 23, 2025 | 4:17 PM

భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి తిథిన గణపతి జన్మించినట్లు హిందువుల నమ్మకం. అందుకే ప్రతి ఏడాది ఈ రోజున వినాయక చవితి పండగని జరుపుకుంటారు. ఈ రోజున గణపతి భూమి మీదకు వస్తాడని నమ్మకం. ఈ సంవత్సరం వినాయక చవితి పండగను 2025 ఆగస్టు 27 బుధవారం జరుపుకోనున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా గణేష్ చతుర్ధి సందడి మొదలైంది. దేశవ్యాప్తంగా గణేష్‌కు గొప్ప పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది అరుదైన గ్రహాల కలయిక జరగనుంది.

1 / 5
భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి రోజున 'గణేష్ చతుర్థి' జరుపుకుంటారు. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి 27 ఆగస్టు 2025న వచ్చింది. ఈ రోజున దేశవ్యాప్తంగా గణపయ్యకి పూజలు నిర్వహిస్తారు. దీనితో పాటు, భక్తులు ఇళ్లలో, దేవాలయాలలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించి.. పది రోజులు నియమ నిష్టలతో భగవంతుడిని పూజిస్తారు. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి నాడు అరుదైన గ్రహాల కలయిక జరగనుంది. దీంతో పండుగ ప్రాముఖ్యతను అనేక రెట్లు పెంచుతోంది.

2 / 5
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం వినాయక చవితి రోజున ప్రీతి, సర్వార్థ సిద్ధి, రవి యోగం,  ఇంద్ర-బ్రహ్మ యోగం ఏర్పడనున్నాయి. దీనితో పాటు గ్రహాల రాకుమారుడైన బుధుడు, విలాస కారకుడైన శుక్రుడు కర్కాటక రాశిలో ఉండటం వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. అదే సమయంలో ఈ తేదీన బుధవారం జరిగే మహాసంయోగం కారణంగా ఈ రోజు కొన్ని రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశులకు చెందిన వ్యక్తులు వ్యాపారంలో లాభాలు పొడనున్నారు. ఈ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

3 / 5
తులా రాశి: ఈ సమయం తులా రాశి వారికి లాభ అవకాశాలు పెరుగుతాయి. ఆశించిన ఫలితాలను పొందనున్నారు. గణేశుడి ఆశీస్సులతో వ్యాపారంలో ఆశించిన లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతుంది. ఈ సమయంలో కొత్త సంస్థలో పనిచేసే అవకాశం పొందుతారు. కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదం, ప్రేమ వీరికి లభిస్తుంది. గ్రహాల ప్రత్యేక ప్రభావం కారణంగా వాహనం లేదా భూమి కొనాలనే కల నెరవేరుతుంది. ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఉద్యోగస్తులకు గౌరవం లభిస్తుంది.

4 / 5
కుంభ రాశి: కుంభ రాశి వారికి ఈ సమయం ప్రత్యేకంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభం లభిస్తుంది. ఈ సమయంలో ఆఫీసులో సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు, పిల్లలకు సంబంధించిన చింతల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆఫీసులో అనుకూలత ఉంటుంది. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. గృహిణులు ఎక్కువ సమయం ఆధ్యాత్మిక కార్యకలాపాలలో గడుపుతారు. పరీక్షలు, పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి పనిచేయాలి. ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం ఉంటుంది

5 / 5
మకర రాశి: ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం రావచ్చు. వ్యాపార విస్తరణ ప్రణాళికల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. అంతేకాదు కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా పర్యాటక ప్రదేశాన్ని సందర్శించడానికి వెళ్తారు. స్టూడెంట్స్ కి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కోరుకున్న ప్రదేశంలో ప్రవేశం పొందవచ్చు. వీరి కృషి, తెలివితేటల కారణంగా ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. శ్రేయోభిలాషులు చాలా సహాయకారిగా ఉంటారు.