
పసుపు పువ్వులు: వినాయక చవితి రోజున గణేశుడికి ఒక్క మొగలి పువ్వు మినహా అన్ని రకాల పూలను సమర్పించవచ్చు. అయితే గణపతి బప్పకు ముఖ్యంగా పసుపు పువ్వులంటే చాలా ఇష్టం. అయితే పొరపాటున కూడా గణపతి పూజలో ఎప్పుడూ తులసి దళాలను సమర్పించవద్దు.

గణేష్ పూజ: ఈ రోజున వినాయకుడిని పూజించండి. వినాయక చవితి రోజున నియమ నిష్టలతో పూజించడం వల్ల సమస్త సమస్యలు తీరుతాయి. గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి మోదకాలు, లడ్డూలు, తాజా పుష్పాలను సమర్పించండి. గణేశుడిని సంపద శ్రేయస్సుకు దేవుడిగా కూడా భావిస్తారు. అందుకే ఈ రోజున ఆయనను పూజించడం వల్ల ఇంట్లో ఆనందం సంతోషం. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

ఈ మంత్రాన్ని జపించండి: గణేష్ చతుర్థి నాడు, "ఓం గం గణపతయే నమః" లేదా "ఓం విఘ్నేశ్వర నమః" అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది.

Vinayaka Chaviti 2024

మోదకం సమర్పించండి: గణేశుడికి ఇంట్లో తయారుచేసిన మోదకం సమర్పించండి. కుడుములు, ఉండ్రాళ్ళు వినాయకునికి ఇష్టమైన నైవేద్యంగా పరిగణించబడుతున్నాయి. కనుక వీటిని నైవేద్యంగా సమర్పించడం వలన వినాయకుని అనుగ్రహం లభిస్తుంది.

ఉండ్రాళ్ళు: గణేశుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టమని చెబుతారు. కనుక గణపతి పూజ సమయంలో తప్పకుండా ఉండ్రాళ్లు ని అది కూడా 21 ఉండ్రాళ్ళను పెట్టె సంప్రదాయం ఉంది. కనుక బొజ్జ గణపయ్యకు ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. తర్వాత ఈ ప్రసాదాన్ని పిల్లలకు పంచితే మీ బాధలన్నీ తొలగిపోతాయి.