
విదుర నీతి ప్రకారం, ఒక వ్యక్తి తన బుద్ధి ప్రకారం నడుచుకోవాలి. ఏ నిర్ణయమైనా దాని మంచి చెడ్డలు ఆలోచించిన తర్వాతే తీసుకోవాలి. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ ముందుకు సాగుతారు. మహాభారతంలో దుర్యోధనుడు తన బుద్ధి ప్రకారం నడుచుకుంటే అతని అంతం ఇంత భయంకరంగా ఉండేది కాదు.

విదుర నీతి ప్రకారం.. మనిషి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇతరులను గౌరవించాలి. ఇతరుల సంతోషానికి, కష్టానికి సాయం చేసే వ్యక్తి ఎల్లప్పుడూ గౌరవించబడతారు. ఇతరుల సంతోషాన్ని ఓర్వలేని వ్యక్తులు జీవితంలో సుఖ సంతోషాలను పొందలేరు.

విదుర నీతి ప్రకారం.. ఎవరి ప్రవర్తన ఉదాత్తంగా ఉంటుందో వారికి ఆనందం, బలం, సంపద , అదృష్టం లభిస్తాయి. దుర్యోధనుడు పాండవులను చూసి అసూయపడ్డాడు. అసూయ ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది. అసూయపడే వ్యక్తి దేనిలోనూ విజయం సాధించడు. అలాంటి వ్యక్తి కష్టాల్లోనే జీవితాంతం గడుపుతూ ఉంటాడు.

మహాత్మ విదుర ప్రకారం, ఇతరుల సంపద, అందాన్ని చూసి అసూయపడే వ్యక్తి.. ఎప్పుడూ సంతోషంగా జీవించడు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. కౌరవులు కూడా పాండవులను చూసి అసూయపడ్డారు, అందుకే మహాభారత యుద్ధం జరిగింది.

తమకు లేదంటూ ఎదుటివారి సంపదను చూసి అసూయపడకూడదు. అసూయ మనిషిని నాశనం చేస్తుంది. అది అతని జీవితంలోని ఆనందాన్ని, శాంతిని హరిస్తుంది. అసూయపడే వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా జీవించలేడు. కనుక మనిషి ఈర్ష అసూయకు దూరంగా ఉండండి.