- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: Why do people hang lemons and chilies at the doorstep?
వాస్తు టిప్స్ : గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయలు కట్టడం వెనుక రహస్యం ఏంటో తెలుసా?
మనం చాలా వరకు ఇంటి ప్రధాన ద్వారానికి, అలాగే షాపుస్‌కి నిమ్మకాయ, మిరపకాయలు కట్టి గుమ్మానికి వేలాడదీయడం చూస్తుంటాం. అయితే చాలా మంది వీటిని నెగిటివ్ ఎనర్జీ ఇంటిలోకి ప్రవేశించకుండా , ప్రతికూల శక్తి నుంచి తమను రక్షించుకోవడానికి కడుతారని అనుకుంటారు. కానీ దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.
Updated on: Aug 23, 2025 | 6:39 PM

ఇంటి గుమ్మానికి లేదా, షాపుల్లో ప్రధాన ద్వారానికి నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంట. చాలా మంది వాటిని ప్రతి కూల శక్తి ఇంట్లో ప్రవేశించకుండా ఉండటమే కాకుండా, దీని వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంట. అయితే మత విశ్వాసాల ప్రకారం, అకలక్ష్మిని ఇంటిలోని రాకుండా చేయడం కోసం, అలాగే ఇంట్లో ఆనందకర వాతావరణం కోసం నిమ్మకాయలు, మిరపకాయల ఇంటి ప్రధాన ద్వారానికి కడతారంట. కాగా, దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

అయితే భారతీయ సంప్రదాయం ప్రకారం నిమ్మకాయ, మిరపకాయలను ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయడానికి ముఖ్య కారణం నరదిష్టి తగలకుండా, లేదా చెడు దృష్టి నుంచి తమను కాపాడుకోవడానికి , వ్యాపారంలో ముందడుగు కోసం, ఇతరుల అసూయ నుంచి తమను రక్షించుకోవడానికి వీటిని కడుతుంటారు. ఇవి ప్రతికూల శక్తి , చెడు దృష్టి నుంచి తమను రక్షిస్తాయని వారి నమ్మకం.

ఇదే కాకుండా మరో కారణం కూడా ఉన్నదని చెబుతున్నారు పండితులు. అది ఏమిటంటే? లక్ష్మీదేవినే కాకుండా తన సోదరి అలక్ష్మీతో ఈ అమ్మవారు కలిసి ఉంటుంది. చాలా మంది లక్ష్మీదేవి ఇంటిలోకి రావాలని కోరుకుంటారు. ఎందుకంటే లక్ష్మీ దేవి సంపదకు చిహ్నం. ఇక అలక్ష్మీ పేదరికం, విభేదాలకు కారణం అయితే, లక్ష్మీదేవితో పాటు అలక్ష్మి తమ ఇంటిలోకి ప్రవేశించకుండా ఉండకూడదని, తమకు ఇష్టమైన పుల్లటి మరి కారం గా ఉండే మిరపకాయలను, నిమ్మకాయలను గుమ్మనికి కడతారంట. అలక్ష్మి వాటిని తిని సంతృప్తి చెంది, ఇంటిలోపలికి ప్రవేశించదంట.

అయితే మూఢనమ్మకాల ప్రకారమే కాకుండా, దీనికి శాస్త్రీయ కారణం ఉన్నదని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే? నిమ్మకాయ, మిరపకాయ రెండూ కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే వీటి నుంచి వెలువడే వాసన ఇంటి చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేసి చెడు బ్యాక్టీరియనులోపలికి రాకుండా చేస్తుందని వీటిని గుమ్మానికి కడతారంట.

ఇక దీనిని కొత్తమంది మూఢనమ్మకంగా భావిస్తే మరికొంత మంది శాస్త్రీయ కోణంలో చూస్తుంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ దీని వలన మానసిక ప్రశాంతత, ఆనందం శ్రేయస్సు లభిస్తుందంట. (నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)



