
లక్ష్మీదేవి హిందూ మతంలో సంపద, శ్రేయస్సుకి సంబంధించిన అధిదేవత అని పిలుస్తారు. లక్ష్మీదేవి కొలువై ఉండే ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఏనుగులతో కలిసి ఉన్న లక్ష్మీదేవిని గజలక్ష్మి అంటారు. అష్ట లక్ష్మిలలో గజలక్ష్మి ఒకరు. గజ లక్ష్మిని పూజించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, సంపద పెరుగుతుంది. ఆమె అదృష్టం, శ్రేయస్సుని ఇచ్చే దేవతగా పరిగణించబడుతుంది.

గజలక్ష్మి కమలం మీద పద్మాసన భంగిమలో కూర్చొని ఉంటుంది. నాలుగు చేతుల్లో వెనుక రెండు చేతుల్లో రెండు తామర పువ్వులను పట్టుకొని ఉంటుంది.

గజలక్ష్మి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి పూజించడం చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా గజ అంటే ఏనుగు.. లక్ష్మీదేవితో పాటు ఏనుగు తామర పువ్వుతో నిలబడి ఉన్న చిత్రం శుభప్రదమైన చిత్రంగా పరిగణించబడుతుంది.

గజలక్ష్మిని ఆరాధించడం ద్వారా వ్యక్తి రుణ విముక్తి పొంది వ్యాపారంలో విజయాన్ని పొందుతాడని నమ్మకం. గజ లక్ష్మికి చెందిన ఈ రూపాన్ని పూజించడం చాలా ఫలవంతమైనది. అయితే ఇంట్లో సరైన స్థలంలో గజలక్ష్మి దేవి చిత్ర పటం ఉంచడం ముఖ్యం.

ఈ గజలక్ష్మి ఆరోగ్యం, శ్రేయస్సు, ఆనందం, విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కనుక గజలక్ష్మిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు ఉంటాయి.

గజలక్ష్మి చిత్రాన్ని ఇంటి ఈశాన్య మూలలో (ఈశాన్య దిశలో) లేదా పూజ గదికి కుడి వైపున ఉంచడం శ్రేయస్కరం. గజలక్ష్మి ఫోటోని ఉత్తరం దిక్కున పెట్టుకోవచ్చు.