
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం జరుపుకోవడమే కాదు.. ఇంట్లోని వస్తువులు, ఇంటి ఆవరణలో మొక్కలను పెంచుకునే విషయంలో కూడా అనేక నియమాలను పేర్కొన్నారు. వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అన్ని నియమాలను మనం గుర్తుంచుకోవాలి. దీని ప్రకారం ఇళ్లలో చెట్లను నాటాలి. ఇలా చేయడం ద్వారా జీవితం సంతోషంగా, సంపన్నంగా సాగుతుంది. ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కలలో ఒకటి నిమ్మ మొక్క. అయితే ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచుకునే విషయంలో కొన్ని వాస్తు నియమాలున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..

ఇంట్లో నిమ్మ చెట్టును పెంచుకోవాలంటే.. సరైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నిమ్మ మొక్కను తప్పు దిశలో నాటడం వల్ల ప్రయోజనం కంటే హాని కలుగుతుంది.

ఇంట్లో నిమ్మ చెట్టును నాటుకోవాలనుకుంటున్నారా.. అయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. నిమ్మ చెట్లను ఇంటికి ఎడమ వైపునా లేదా కుడి వైపులా నటాలా అనే విషయం తెలుసుకోవాలి.

ఇంట్లో సరైన దిశలో నిమ్మకాయ మొక్కను నాటితే.. అది ఆర్థిక శ్రేయస్సును ఆకర్షిస్తుందని నమ్మకం

అంతేకాదు నిమ్మలోని ఔషధ గుణాలు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. దీని ఆకులు, పండ్లను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.

ఇంట్లో వాస్తు దోషం ఉంటే.. నిమ్మ చెట్టు దానిని తగ్గించడంలో సహాయపడుతుంది. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం నిమ్మకాయ చెడు దృష్టిని, ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.

జాతకంలో శని గ్రహ దుష్ప్రభావాలతో బాధపడేవారు తమ ఇంట్లో నిమ్మ చెట్టును నాటుకోవడం శుభప్రదం. ఇలా చేయడం వలన జాతకంలోని శనిశ్వరుడి ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది

నవ గ్రహాల్లో ఛాయ గ్రహాలైన రాహువు, కేతువుల ప్రభావాన్ని తగ్గించడంలో నిమ్మ చెట్టు కూడా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. జాతకంలో ఏదైనా గ్రహ దోషం ఉంటే.. నిమ్మ చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిశలో కూడా నిమ్మ చెట్టును నాటవచ్చు. ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున నిమ్మ చెట్టును నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.