- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips for wealth: Attract Wealth and Positive Energy
Vastu Tips: వాస్తు శాస్త్రంలో వర్షం నీటికి ప్రత్యేక ప్రాముఖ్యత.. సంపద శ్రేయస్సు కోసం వర్షం నీటిని ఎలా ఉపయోగించాలంటే
వర్షపు నీరు ప్రకృతి ప్రసాదించిన వరం మాత్రమే కాదు.. వాస్తు శాస్త్రం ప్రకారం.. వర్షం నీరు సానుకూల శక్తి, శ్రేయస్సుకు కూడా మూలం అని నమ్ముతారు. వర్షం నీరుని సరిగ్గా ఉపయోగిస్తే, ఇంట్లో శ్రేయస్సు ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ రోజు వర్షపు నీటికి సంబంధించిన ప్రత్యేక వాస్తు నివారణల గురించి తెలుసుకుందాం.
Updated on: Jul 01, 2025 | 11:19 AM

వర్షపు నీరు ముఖ్యంగా అకాల వర్షాలు, పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయని భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా కురిసే వర్షం నీరు ఇంటి చుట్టూ లేదా లోపల పేరుకుపోయిన ప్రతికూల శక్తిని కడిగివేస్తుంది. తద్వారా సానుకూలతను వ్యాపింపజేస్తుంది. ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది.

జ్యోతిషశాస్త్రం, వాస్తు శాస్త్రం రెండింటిలోనూ గ్రహాల స్థానం ఒక వ్యక్తి జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. కొన్ని చర్యలలో వర్షపు నీటిని ఒక ప్రత్యేక లోహపు పాత్రలో సేకరించి సంబంధిత గ్రహాలను శాంతింపజేయడానికి ఉపయోగిస్తారు. వర్షం నీరు గ్రహాల అశుభ ప్రభావాలను తగ్గిస్తుందని, ఇది సంపద ప్రవాహానికి మార్గం తెరుస్తుందని నమ్ముతారు.

వాస్తు శాస్త్రంలో నీటిని సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. వర్షపు నీరు నేరుగా ప్రకృతి నుంచి వస్తుంది. ఈ నీటిని సేకరించి ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఈ ప్రదేశం దేవతల ప్రదేశం. ఇక్కడ నీటిని ఉంచడం వలన సంపద దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభిస్తుంది. ఇది ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది.

వర్షం తరచుగా కొత్త ప్రారంభాలను, తాజాదనంతో ముడిపడి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం వర్షపు నీటితో స్నానం చేయడం లేదా ఇంట్లో చల్లడం వల్ల దురదృష్టం తొలగిపోతుంది. కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. ఇది వ్యాపారం, ఉద్యోగంలో వృద్ధికి దారితీస్తుంది.

వర్షపు నీరు అత్యంత స్వచ్ఛమైన, పవిత్రమైన నీటి వనరులలో ఒకటి. వాస్తులో, ఏ రకమైన స్వచ్ఛత , పవిత్రత అయినా సానుకూల శక్తికి మూలంగా పరిగణించబడుతుంది. ఈ నీటిని పూజలో లేదా ఇంటిని శుద్ధి చేయడానికి ఉపయోగించడం వల్ల ఇంట్లోకి దైవిక శక్తి వస్తుంది. ఇది పేదరికాన్ని తొలగిస్తుంది.

కొన్ని నమ్మకాల ప్రకారం పితృ దోషం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. వర్షపు నీటిని పూర్వీకులకు తర్పణం సమర్పించడానికి లేదా దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి ఉపయోగించవచ్చు. దీనివల్ల పూర్వీకులు సంతోషిస్తారని, వారు తమ ఆశీర్వాదాలను ఇస్తారని.. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.




