6 / 8
సంక్షోభాన్ని నివారించడానికి
జీవితంలో కష్టాల నుంచి బయటపడడానికి హనుమంతుని ఆరాధన అత్యుత్తమం. హనుమంతుడి అనుగ్రహం ఉన్న వారు జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తాడు. అందుకే హనుమంతుడిని సంకట మోచనుడు అని పిలుస్తారు. ఇందుకోసం శనివారం రోజున హనుమంతుడికి సింధూరం, నువ్వుల నూనె, వేరు శనగలను సమర్పించండి. దీని తరువాత హనుమంతుడికి ఎర్ర గులాబీల దండను సమర్పించండి. లడ్డూలను నైవేద్యంగా సమర్పించండి. పూజ తరువాత ఈ ప్రసాదాన్ని ప్రజలకు పంచండి. ఇలా వరుసగా 7 శనివారాలు చేయండి. ఇలా చేయడం వలన అన్ని కష్టాలు తొలగిపోతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి.