
వృషభం: రాశ్యధిపతి శుక్రుడి ఉచ్ఛ స్థితితో పాటు రవి లాభ స్థితి వల్ల ఈ రాశివారికి ఉగాది నుంచి రాజ యోగాలు పట్టడం మొదలవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రాజకీయ, ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.

మిథునం: ఈ రాశికి ఉగాదితో కొత్త దశ మొదలవుతుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం ఫలితాలనిస్తుంది. సరికొత్త నైపుణ్యాలను ఒంటబట్టించుకోవడం వల్ల ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపా రాలు బిజీ అవుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది.

కర్కాటకం: భాగ్య స్థానంలో రెండు రాజయోగకారక గ్రహాలు యుతి చెందడం వల్ల ఉగాది నుంచి ఈ రాశివారికి తప్పకుండా దశ తిరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. విదేశీ అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది. ప్రముఖులతో పరిచయాలు బాగా వృద్ధి చెందుతాయి. రాజకీయాల్లో లేదా ప్రభుత్వంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ నెల 16 తర్వాత శుక్ర, రవులు యుతి చెందడం వల్ల ఉగాది నుంచి వీరికి తప్పకుండా దశ తిరుగుతుంది. అదృష్టం అనేక విధాలుగా తలుపు తడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు లభించే అవకాశం ఉంది. అనేక వైపు నుంచి ఆదాయం వృద్ది చెందుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా విస్తరిస్తాయి. అనారోగ్యాల నుంచి కోలుకుంటారు.

మకరం: ఉగాదికి ఒకటి రెండు రోజుల వ్యవధిలో రెండు రాజయోగ కారక గ్రహాలు రాశులు మారడం వల్ల ఈ రాశివారు ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే అవకాశం ఉంది. శ్రమ తక్కువ లాభం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. వ్యక్తి గత, ఆర్థిక సమస్యల నుంచే కాక అనారోగ్యాల నుంచి కూడా చాలావరకు విముక్తి లభిస్తుంది.

కుంభం: ఈ రాశివారికి ఉగాది నుంచి ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ధన స్థానంలోకి మారుతున్న రవి, శుక్రుల వల్ల ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, మరింతగా జీతభత్యాలనిచ్చే ఉద్యోగంలోకి మారడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఉద్యోగంలో అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల బాగా లబ్ధి పొందుతారు.