
మన ఇంట్లో 5 నిముషాలు కరెంట్ పోతేనే వెంటనే పవర్ స్టేషన్ కు కాల్ చేసి పవర్ ఎప్పుడు వస్తుందని అడుగుతాము. అలాంటిది, ఆ దేశంలో 2 నెలల పాటు వెలుగే ఉండదు ఇంకా చెప్పాలంటే అసలు సూర్యుడే కనిపించకుండా మాయమైపోతాడు. ఇది వినడానికి షాకింగ్ లాగా ఉన్నా ఇదే నిజం

అలాస్కాలోని ఉత్కియాగ్విక్ అనే పట్టణంలో సూర్యుడు రెండు నెలల పాటు కనిపించడు. ప్రతి ఏడాది నవంబర్ లో అస్తమించి మళ్ళీ జనవరిలోనే తిరిగి ఉదయిస్తాడు. అక్కడి ప్రజలు దీనికి అలవాటు పడ్డారు.

దీనిని పోలార్ నైట్ అంటారు. భూమి కొంత టిల్ట్ అయ్యి ఉండటం వలన ఇలా జరుగుతుంది. 60 రోజుల పాటు ఆ పట్టణం మొత్తం అంద కారంలో మునిగిపోతుంది. అయితే, అక్కడి ప్రజలు ముందుగానే అన్ని వసతులు ఏర్పరచుకుంటారు.

అక్కడ సూర్యోదయం ఉండడు, వెలుతురు కూడా ఉండదు అంతా చీకటిమయమైతుంది. ఇక జనవరిలో మళ్ళీ సూర్యుడు తిరిగొచ్చిన తర్వాత ప్రజలు దాన్ని ఒక పెద్ద పండుగలా జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటారు.

ఆ పట్టణ ప్రజలు రెండు నెలల పాటు చీకటిలో ఉన్న తర్వాత మొదటి సారి సూర్యుడిని చుశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒకరినొకర్ని హగ్ చేసుకుంటారు. ఆ తర్వాత, తమ పనులను యథావిధిగా చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తారు.