తిరుమలలో భక్తుల వెల్లువ.. కేవలం 3 రోజుల్లో 2.42 లక్షల మందికి శ్రీవారి దర్శనం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు!

Edited By:

Updated on: Jun 14, 2026 | 7:52 PM

TTD latest news: తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. గత మూడు రోజుల్లో 2.42 లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సేవలు, వసతి, తలనీలాల సమర్పణ వంటి అన్ని విభాగాల్లో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

1 / 10
తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు ముగిస్తుండటంతో పాటు రెండో శనివారం, ఆదివారం తోడు కావడంతో తిరుమల కిక్కిరిసిపోతోంది. గత మూడు రోజులు భక్తులతో తిరుమల క్షేత్రం పోటెత్తింది. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టిటిడి నిరంతరాయంగా సేవలు అందిస్తోంది.

2 / 10
అధికారుల పర్యవేక్షణ.. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1,2, నారాయణగిరి షెడ్లు బయట క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో టీటీడీ యంత్రాంగం అనునిత్యం పర్యవేక్షిస్తోంది.భక్తులకు మెరుగైన సేవలు అందిస్తోంది.

3 / 10
టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, అన్న ప్రసాదం విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్ర, ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాస్కర్, శ్రీవారి సేవా విభాగం పర్యవేక్షకులు సీపీఆర్వో డాక్టర్ టి.రవి తోపాటు వివిధ కళ్యాణ కట్టలను ఆ విభాగాధిపతి రమాకాంత్, అశ్విని ఆసుపత్రి మెడికల్  సూపరింటెండెంట్ డా. సుబ్బారెడ్డి,  భద్రతా విభాగం వీజీవో సురేంద్రలు తమ బృందాలతో క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సేవలను పర్యవేక్షిస్తున్నారు. ఆయా విభాగాల అందిస్తున్న  సౌకర్యాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.

4 / 10
అన్న ప్రసాద విభాగం సేవలు ఇవే... భక్తులు వేచి ఉండే క్యూలైన్లలో 29 పాయింట్లలో భక్తులకు అన్న ప్రసాద పంపిణీ చేస్తుంది టీటీడీ. ఒక్కో పాయింట్ దగ్గర నలుగురు ఉండి శ్రీవారి సేవకులు భక్తులకు అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తోంది.

5 / 10
ఇది ఇంజనీరింగ్ విభాగం పని.. ఇక 37 పాయింట్లలో తాగునీటి కుళాయిలను టీటీడీ ఇంజనీరింగ్ విభాగం ఏర్పాటు చేసింది. బాట గంగమ్మ వద్ద గల 69వ గేట్ నెంబర్ నుంచి   నారాయణ గిరి షెడ్ల వద్ద ఉన్న సర్వీస్ లైన్ గేట్ నెంబర్ 1 వరకు భక్తులకు అందుబాటులో ఉంచింది.

6 / 10
ఇక్కడ అక్కడ అందుబాటులో ఆరోగ్య విభాగం.. మరోవైపు టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లలో 49 పాయింట్లలో త్రాగునీటి డ్రమ్ములు ఏర్పాటు చేసి ఒక్కో డ్రమ్ము వద్ద ఇద్దరు సేవకులు సేవలను అందుబాటులోకి తెచ్చింది. అవుట్ సైడ్ లైన్స్ వద్ద శాశ్వత మరుగు దొడ్లతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసింది. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పరిశుభ్రతకు పెద్ద పీట   వేస్తోంది. అదే విధంగా చెత్త పేరుకుపోకుండా నిమిషాల వ్యవధిలో చెత్తను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య సిబ్బంది విశేష కృషి చేస్తోంది.

7 / 10
అప్రమత్తంగా నిఘా భద్రత విభాగం.. ఇక టీటీడీ విజిలెన్స్ విభాగం ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని అంచనా  వేస్తోంది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భక్తులు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. బాట గంగమ్మ గుడి సర్కిల్ నుండి పాచికాల్వ గంగమ్మ గుడి సర్కిల్ వరకు మరో 29 బ్లాకులను ఏర్పాటు చేయడంతో భక్తులు సౌకర్యవంతంగా, క్రమ పద్ధతిలో క్యూలైన్లలో వేచి ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఒక్కో బ్లాకులో 150 మంది భక్తులు వేచి ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, అదనపు తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేసిన టీటీడీ ఒక్కో బ్లాక్ వద్ద ఒక సెక్యూరిటీ గార్డుతో పాటు ఇద్దరు శ్రీవారి సేవకులు విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టింది.

8 / 10

మూడు రోజుల్లో టీటీడీ గణాంకాలు ఇవే... 
గత మూడు రోజుల్లో 2,42,894 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. శనివారం 92,830 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా, స్వామివారి కైంకర్యాల నేపథ్యంలో దర్శన సమయం తక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయడంతో అత్యధిక సంఖ్యలో శుక్రవారం 74,636 మంది భక్తులు, గురువారం 75,428 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు తిరుమలలో ఉన్న 5 యాత్రికుల వసతి సముదాయాల్లో భక్తులు వసతి పొందేందుకు వీలుగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ ఐదు ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది వేల లాకర్లు అందుబాటులో ఉంచింది.

మూడు రోజుల్లో టీటీడీ గణాంకాలు ఇవే... గత మూడు రోజుల్లో 2,42,894 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. శనివారం 92,830 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా, స్వామివారి కైంకర్యాల నేపథ్యంలో దర్శన సమయం తక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయడంతో అత్యధిక సంఖ్యలో శుక్రవారం 74,636 మంది భక్తులు, గురువారం 75,428 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు తిరుమలలో ఉన్న 5 యాత్రికుల వసతి సముదాయాల్లో భక్తులు వసతి పొందేందుకు వీలుగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ ఐదు ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది వేల లాకర్లు అందుబాటులో ఉంచింది.

9 / 10
భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. గత మూడు రోజుల్లో 1,34,637 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం విశేషం. తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతో పాటు 11 మినీ కల్యాణకట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. క్షురకుల ద్వారా భక్తులకు నిరంతరాయంగా సేవలు అందిస్తోంది.

10 / 10
మరో పక్క భక్తులు సేవలో పోటు విభాగం, రవాణా, తదితర ఇవ్వగల ద్వారా నిరంతరాయంగా సేవలను అందిస్తోంది. టీటీడీ అధికారులు, సిబ్బంది, దర్శన క్యూలైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ రాత్రింబవళ్లు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ యంత్రాంగం శ్రమిస్తుంది.

Follow Us