
ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈరోజున విష్ణు మూర్తి నిద్రలోకి వెళ్తాడు. దాదాపు నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉంటారు. దీంతో ఈ సమయంలో పూర్తి బాధ్యత మొత్తం శివుడిపై పడుతుంది. ఇది చాతుర్మాసానికి ప్రారంభం అంట. అందుకే ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు.

అయితే ఈ సంవత్సరం 2026లో జూలై 25 శని వారం రోజున తొలిఏకాదశి వస్తుంది. ఈ రోజు విష్ణు మూర్తిని పూజిస్తూ, ప్రత్యేక పరిహారాలు పాటించడం వలన జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలిగిపోతాయి అంటారు. అంతే కాకుండా ఈరోజు కొన్ని పరిహారాలు పాటించడం వలన అప్పుల బాధలు తొలిగిపోయి, ఆర్థికంగా కలిసి వస్తుందంట.

ఈ తొలిఏకాదశి రోజున విష్ణు మూర్తితో పాటు, లక్ష్మీదేవిని పూజించాలి. దీని వలన జీవితంలో ఉన్న అనేక సమస్యలు తొలిగిపోతాయి. అంతే కాకుండా ఇది ఆర్థికంగా కలిసి వచ్చేలా చేస్తుంది. అయితే ఈరోజు విష్ణు మూర్తితో పాటు లక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తితో పాటు యోగనిద్రలోకి వెళ్తుంది. దీని వలన ఈ రోజు లక్ష్మీదేవికి ఎర్రకుంకుమ సమర్పించడం వలన ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయంట.

తొలిఏకాదశి రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేసి, ఈ రోజు విష్ణు మూర్తిని, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి ప్రార్థనలు చేయడం వలన ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయంట. ముఖ్యంగా ఈ రోజు ఒక పీటపై పసుపు వస్త్రాన్ని ఉంచి, దానిపై విష్ణు మూర్తి ఫొటో పెట్టి, నెయ్యి దీపం వెలిగించి, పూజలు చేయడం వలన అప్పుల బాధలు తొలిగిపోతాయంట.

అంతే కాకుండా తులసి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది అంటారు. అందువలన తొలి ఏకాదశి రోజు తులసి మాతను పూజించడం వలన ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయంట.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు