7 / 13
కన్యా రాశి: ఈ రాశి వారికి ప్రస్తుతానికి ఎక్కువగా ఆర్థిక నిల్వలు ఉండే అవకాశం లేదు. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశికి అధిపతి అయిన బుధ గ్రహం భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ, ధన కారకు డైన గురుగ్రహం అష్టమ స్థానంలో ఉండటం వల్ల అనుకోని ఖర్చులు మీద పడటం, ఇతరులను తప్పనిసరిగా ఆదుకోవలసి రావటం, రావలసిన డబ్బు చేతికి అందకపోవటం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.