
నవ గ్రహాల్లో శని గ్రహానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతనే వేరు. శని గ్రహం కొన్నిసార్లు మంచి ఫలితాలను ఇస్తే మరికొన్ని సార్లు జీవితంలో అడుగడుగునా కష్టాలు, నష్టాలనే ఇస్తుంది. అయితే కొత్త సంవత్సరంలో మాత్రం శని కొన్ని రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.

శని గ్రహం బలహీనపడినప్పుడు కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 5వ తేదీ నుంచి శని గ్రహం బలహీన స్థితిలో సంచరించనున్నాడు. దీంతో కొన్ని రాశులవారిపై శని ప్రభావం తగ్గనున్నది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కుంభరాశి : కుంభ రాశి వారికి రెండవ ఇంటిలో శని సంచారం చేయనున్నాడు. దీని వలన అన్నివిధాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే వారికి ఇది అనుకూలమైన సమయం. ఆస్తిపాస్తులు కూడా పెరిగే ఛాన్స్ ఉంది.

మీన రాశి : మీన రాశి వారికి శని మొదటి ఇంటిలో ఉండటం వలన వీరికి చాలా అనుకూలంగా ఉండనుంది. వ్యాపార ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులు చాలా ఆనందంగా గడుపుతారు. కళారంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. వివాహం ప్రయత్నాలు ఫలమిస్తాయి.

తుల రాశి : తుల రాశి వారికి శని బలహీన స్థానంలో సంచారం చేయడం వలన లక్కు కలిసి వస్తుంది. వీరు ఏ పని చేసినా అందులో సక్సెస్ అవుతారు. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. ఈ రాశుల వారు చదువు పూర్తి చేసుకొని, ఉద్యోగప్రయత్నాల్లో నిమగ్నం అవుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.